కామారెడ్డి, ఫిబ్రవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకార వేతనాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వంద శాతం అదేవిధంగా ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో 773 మంది ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. వీరందరి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పూర్తిచేయాలని సూచించారు. దరఖాస్తులను పూర్తి వివరాలతో ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి రజిత, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.