నిజామాబాద్, ఫిబ్రవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ఆధ్వర్యంలో మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని జిల్లా కమిటీ తీర్మానించారు. జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని పెన్షనర్ల కుటుంబ సమ్మేళనంగా మార్చి 8న బస్వా గార్డెన్ నిజామాబాద్ నందు నిర్వహించాలని, మహిళా రిటైర్డ్ ఉద్యోగులకు ఇండోర్ గేమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్రేమలత, మేరీ కన్వీనర్లుగా ఆటల పోటీలు నిర్వహించబడతాయని జిల్లా కార్యదర్శి కె. రామ్మోహన్ రావు తెలిపారు. మహిళల పట్ల అమానవీయ సంఘటనలు జరుగుతున్నాయని వాటిని నిరోధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు మహిళా పెన్షనర్ల నాయకులు తెలిపారు. పెన్షనర్ల కుటుంబ సమ్మేళనానికి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్, టీఎన్జీవోల అధ్యక్షులు అలుక కిషన్ తదితరులను ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు.
జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా నాయకులు ఈవిల్ నారాయణ, జార్జి, లావు వీరయ్య, బేబీ, భారతి, హమీద్, లక్ష్మీనారాయణ, సాయిలు, ఫ్లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.