ప్రజావాణి ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కారం చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను జిల్లా స్థాయి అధికారులు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యలను అధికారులు తక్షణమే పరిశీలించి ప్రజలకు విశ్వాసం కలిగించాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ వెంకట మాధవరావు, ఏవో రవీందర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »