వేములవాడ, మార్చ్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ కూడలి వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం ఎదుట ఎంఆర్‌పిఎస్ మరియు మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఎంఆర్‌పిఎస్ జిల్లా ఇంచార్జి ఖానాపురం లక్ష్మణ్ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్ గుండా థామస్ జిల్లా నాయకుడు తండ్రాల తిరుపతి, ఎంఎస్‌ఎఫ్ జిల్లా కో ఆర్డినేటర్ సుంకపాక దామోదర్ మాదిగ మాట్లాడుతూ ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత సాధనకై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో మాదిగలకు ఇచ్చిన హామీని విస్మరించినందుకు ఎస్‌సి వర్గీకరణ జాప్యానికి నిరసనగ గాంధీభవన్‌పై దాడి చేసిన నిరసన ఘటనలో ప్రమాదవశాత్తు కాలి మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలర్పించిన మాదిగ అమర వీరులు అయిన పొన్నాల సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగలకు, వివిధ పోరాట రూపాల్లో మరణించిన తెల్ల బండ్ల రవి మాదిగ, ప్రభాకర్ మాదిగ, భారతి మాదిగలకు బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు.
వారి ఆశయ సాధన కోసం ఎస్‌సి వర్గీకరణ జరిగేంత వరకు పాలకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిపిన ఎంత నిర్బంధం కొనసాగించిన ఉద్యమం విజయం సాధించేవరకు తుది వరకు పోరాటాన్ని కొనసాగించి ఎస్సీ వర్గీకరణను సాధించి వారికి ఘనంగా నివాళులు అర్పించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ మండల ఇంచార్జిలు ఎడపల్లి నాగరాజు, ఆవునూరి లచ్చన్న, విహెచ్‌పిఎస్ జిల్లా కో కన్వినర్ తలారి సురేష్, ఎంఎస్‌ఎఫ్ నాయకుడు ఎడపల్లి మహేష్, ఎంఆర్‌పిఎస్ ప్రాన్సిస్, నెదురీ లక్ష్మణ్, ఎరెల్లి నారాయణ, గుడిసె కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.