డిచ్‌పల్లి, మార్చ్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు శుక్రవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం జరిగిన పరీక్షల్లో మొత్తం 1401 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 1321 మంది హాజరు, 80 గైర్హాజరు అయినట్లు ఆమె తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో మొత్తం 11814 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 11024 మంది హాజరు, 790 గైర్హాజరు అయినట్లు ఆమె తెలిపారు.
ఏ పరీక్షాకేంద్రంలో మాల్ ప్రాక్టీస్ జరుగలేదని ఆమె తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం కామారెడ్డిలో ఆర్కె, సాందీపని, ఎస్ ఆర్కె, పిజెఆర్, మంజీరా, వశిష్ట, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విజ్ఞాన భారతి డిగ్రీ కళాశాలలో గల పరీక్షాకేంద్రాలను కంట్రోలర్ ఆచార్య ఎం. అరుణ, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య బి. విద్యావర్ధిని పర్యవేక్షించారు.