14 వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, మార్చ్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేయుటకు వైద్యుల పొస్టులు 14 ఖాళీల కోసం ఎం.బి.బి.ఎస్‌ విద్యార్హత గల అభ్యర్థుల నుండి మరియు ఒక యస్‌.టి.యస్‌. సీనియర్‌ ట్రీట్‌ మెంట్‌ సూపర్‌ వైజర్‌ – టి.బి. పోస్టు కోసం ఏదేని బాచిలర్స్‌ డిగ్రీ లేదా సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ ట్రైనింగ్‌ కోర్సు పూర్తి చేసి రెండు నెలల కంప్యూటర్‌ కోర్సు శిక్షణతో పాటు ద్విచక్ర వాహనం పర్మనెంట్‌ లైసెన్స్‌ కలిగివున్న అభ్యర్థుల నుండి కాంట్రాక్టు పద్ధతిలో నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తుతో పాటు తగిన అర్హతల నిజ ధృవ పత్రములతో ఈనెల 8న వైద్యాధికారుల పోస్టు కోసం ఉదయం 11-00 గంటలకు మరియు ఎస్‌.టి.ఎస్‌. పొస్టు కోసం మధ్యాహ్నం 1 గంటలకు కలెక్టరేట్‌ రూమ్‌ నంబర్‌ 105 లో గల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి జిల్లా కలెక్టర్‌, కామారెడ్డి ఆధ్వర్యములో నిర్వహించ బడుతుందని స్పష్టం చేశారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »