నా ఓటే నా భవిష్యత్‌ – ఒక్క ఓటుకున్న శక్తి

కామారెడ్డి, మార్చ్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ‘నా ఓటే నా భవిష్యత్‌ – ఒక్క ఓటు కున్న శక్తి’ అనే అంశంపై భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవం – 2022 సందర్భంగా ఓటర్‌ ఆవగాహన పోటీ నిర్వహిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సిస్టమేటిక్‌ ఓటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌ (స్వీప్‌) కార్యక్రమం ద్వారా ప్రజల్లో దాగి ఉన్న సృజనాత్మక, కళాత్మక విలువల్ని వెలికితీస్తూ, తద్వారా భారతీయ ప్రజాస్వామ్య పునాదులను సుదృడం చేసేందుకు గాను అన్ని వయసుల వారు ఇందులో పాల్గొనేలా ప్రతి ఒక్క ఓటు విలువలను పెంపొందించేలా భారత ఎన్నికల సంఘం పోటీలను నిర్వహిస్తుందని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు.

నా ఓటే నా భవిష్యత్తు ఒక్క ఓటు కున్న శక్తి అనే అంశంపై జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పోటీలో ఐదు కేటగిరీలు ఉంటాయని పేర్కొన్నారు. క్విజ్‌ పోటీ, స్లొగన్స్‌ (నినాదాలు) పోటీ, పాటల పోటీ, వీడియో మేకింగ్‌ పోటీ, పోస్టర్‌ డిజైన్‌ పోటీలు ఉంటాయని తెలిపారు. క్విజ్‌ పోటీలో మూడు స్థాయిలు తేలిక, మధ్యస్తం, కఠినం ఉంటాయని పేర్కొన్నారు. స్లొగన్స్‌ పోటీలో పాల్గొనే అభ్యర్థులు చక్కటి పదాలతో చక్కటి భావాలతో పైన తెలిపిన అంశంపై మనసుకు హత్తుకునే నినాదాలు రాయాలని తెలిపారు.

పాటల పోటీలో పాల్గొనే అభ్యర్థులు శాస్త్రీయ సంగీతం, సమకాలీన సంగీతం, రాప్‌ మొదలైనవి ఎంచుకోవచ్చని, సొంత కాంపోజిషన్‌ మాత్రమే పాడాలని పేర్కొన్నారు పాట నిడివి మూడు నిమిషాలకు మించి ఉండకూడదని తెలిపారు. వీడియో మేకింగ్‌ పోటీలో పాల్గొనే వారు భారతీయ ఎన్నికల నిర్వహణ వైభవం, విభిన్నత మొదలైన అంశాల పైన షార్ట్‌ ఫిలిం రూపొందించాలని తెలిపారు.

వాటితో పాటు ప్రజలకు ఓటు పట్ల అవగాహన, నైతిక ఓటింగ్‌, ఓటుకున్న శక్తి, ఓటింగ్‌ ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌, నవ యువత , మొదటిసారి ఓటు వేస్తున్న ఓటర్లు తదితర అంశాలపై వారికి స్ఫూర్తి అందించే అంశాలపైన చిత్రాలు తీయవచ్చని పేర్కొన్నారు. వీడియో ఫిలిం నిడివి కేవలం ఒక్క నిమిషం మాత్రమే ఉండాలని తెలిపారు. పోస్టర్‌ డిజైన్‌ పోటీల్లో పాల్గొనేవారు ఆలోచనలను రేకెత్తించే స్పూర్తివంతమైన పోస్టర్స్‌ ను సృష్టించవచ్చని, అభ్యర్థులు ఒక డిజిటల్‌ పోస్టర్‌ లేదా హ్యాండ్‌ పెయింటెడ్‌ పోస్టర్లను సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

పోటి కేటగిరీలు :
ఇనిస్టిట్యూషల్‌ కేటగిరీలో… విద్యాసంస్థలు (కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలను అనుసరించి గుర్తింపు పొందిన పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు) ఉంటాయని తెలిపారు.
ప్రొఫెషనల్‌ కేటగిరిలో… ఎవరైతే తాము వీడియో మేకింగ్‌ /పోస్టర్‌ డిజైనింగ్‌ /పాటలు పాడడం ప్రధాన వృత్తిగా స్వీకరించి తమ ప్రధాన ఆదాయ వనరుగా, దానిపై ఆధారపడి జీవించేవారు. వీరే వృత్తి నిపుణులు. వీరు గనక సెలక్ట్‌ అయితే తాము ప్రొఫెషనల్‌ కేటగిరికి చెందుతామని సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అమెచ్యూర్‌ కేటగిరీలో… వీడియో మేకింగ్‌/ పోస్టర్‌ డిజైనింగ్‌ /గానం ఒక హాబీగా, తమలోని కలను నిరూపించుకోవడానికి, వారు తమ ప్రధాన ఆదాయ వనరుగా వేరే పని చేస్తూ, ఉంటారో వారే ఔత్సాహికులని కలెక్టర్‌ చెప్పారు. ప్రతి కేటగిరిలో అత్యుత్తమంగా నిలిచిన ముగ్గురు విజేతలకు నగదు బహుమతులు ప్రత్యేక ప్రశంస విభాగంలో విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామని తెలిపారు.

పాటల పోటీలో మూడు కేటగిరీలు ఇనిస్టిట్యూషనల్‌ లో ప్రథమ బహుమతిగా లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతిగా 50 వేలు, తృతీయ బహుమతిగా 30 వేలు, ప్రొఫెషనల్‌లో ప్రథమ బహుమతిగా 50 వేలు, ద్వితీయ బహుమతిగా 30 వేలు, తృతీయ బహుమతి 20 వేలు, అమెచూర్‌లో ప్రథమ బహుమతిగా 30 వేలు, ద్వితీయ బహుమతిగా 20 వేలు, తృతీయ బహుమతిగా పది వేలు ఉంటాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.

వీడియో మేకింగ్‌ పోటీలో ప్రథమ బహుమతిగా రెండు లక్షలు, ద్వితీయ బహుమతిగా ఒక లక్ష, తృతీయ బహుమతిగా 75 వేలు ఉంటాయని, పోస్టర్‌ డిజైన్‌ పోటీలో ప్రథమ బహుమతిగా 50 వేలు, ద్వితీయ బహుమతిగా 30 వేలు, తృతీయ బహుమతిగా 20 వేలు ఉంటాయని పేర్కొన్నారు.

పోటీలో పాల్గొనాలని అనుకునే అభ్యర్థులు వెబ్‌ సైట్‌ను సందర్శించాలని తెలిపారు. విద్యార్థి తమ వివరాలతో పాటు ఎంట్రీలను ఈమెయిల్‌ ద్వారా పంపుకోవాలని కలెక్టర్‌ సూచించారు. విద్యార్థి తాను పంపుతున్న పోటీ పేరు, కేటగిరీలను, ఈమెయిల్‌ సబ్జెక్టులో స్పష్టంగా రాయాలని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనేవారు వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. అన్ని ఎంట్రీలు పంపుకోవడానికి 15 మార్చి 2022 చివరి తేది అని పేర్కొన్నారు. ఎంట్రీలను ఈమెయిల్‌ ద్వారా పంపించాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »