సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అనిర్వచనీయం

నిజామాబాద్‌, మార్చ్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని వక్తలు కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ మరింత అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో అట్టహాసంగా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

నిజామాబాద్‌ అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా అధ్యక్షతన జరిగిన వేడుకలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, శాసన మండలి సభ్యులు వి.గంగాధర్‌ గౌడ్‌, నగర మేయర్‌ నీతూకిరణ్‌ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కేక్‌ కట్‌ చేసి మహిళా దినోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు మాట్లాడుతూ, నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుకుంటున్నారని అన్నారు. సమాజ కట్టుబాట్ల వల్ల ఒకప్పుడు వంటింటికే పరిమితం అయిన మహిళల్లో పూలే దంపతులు ఎంతో చైతన్యం నింపారని గుర్తు చేశారు. లింగ వివక్షకు లోనవుతున్న మహిళలు సమానత్వాన్ని సాధించాలంటే వారికి చదువు ఎంతో అవసరం అని భావించిన జ్యోతిబాపూలే తన సతీమణి సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి, ఆమె చేత 1848 వ సంవత్సరంలోనే మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేయించారని అన్నారు.

నాలుగేళ్ల వ్యవధిలోనే మహిళల కోసం ఇరవై పాఠశాలలు ఏర్పడ్డాయని, మహిళల్లో చైతన్యం పెంపొందేందుకు ఇవి ఎంతగానో దోహదపడ్డాయని పేర్కొన్నారు. పూలే దంపతుల తరహాలోనే మొట్టమొదటి మహిళా డాక్టర్‌గా విశేష సేవలందించిన డాక్టర్‌ ఆనందీబాయి జోషి, అంతరిక్ష ప్రయాణం చేసిన కల్పనా చావ్లా, తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిణిగా కిరణ్‌ బేడీ తదితరులు కూడా మహిళా లోకానికి ఆదర్శప్రాయులయ్యారని అన్నారు.

నిజామాబాద్‌ జిల్ల్లాకు చెందిన మాలావత్‌ పూర్ణ, నిఖత్‌ జరీన్‌, యెండల సౌందర్య, ఇటీవలే హర్యానా రాష్ట్రంలో జరిగిన స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లో బంగారు పతకం సాధించిన రత్నమాల వంటి అనేకమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుతూ జిల్లా కీర్తిని ఇనుమడిరపజేస్తున్నారని అన్నారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో పరిపూర్ణంగా రాణిస్తూ స్త్రీ శక్తిని చాటిచెబుతున్నారని ప్రశంసించారు. వారికి అప్పగించే ప్రతి బాధ్యతను ఎంతో సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ తమ దక్షతను నిరూపించుకుంటున్నారని అన్నారు.

ఒకవిధంగా చెప్పాలంటే పురుషులకు కూడా సాధ్యపడని రీతిలో మహిళలు ఇంటి బాధ్యతలను చక్కబెడుతూనే, అటు తమ ఉద్యోగ పదవీ బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తున్నారని అభినందించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం అమలులో మహిళా ప్రజాప్రతినిధుల క్రియాశీలక భాగస్వామ్యం వల్లే ఆశించిన లక్ష్యాలు సాదించగలుగుతున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాల్లోనే కాకుండా ఎంతో కష్టతరమైన పనులతో కూడుకుని ఉండే వ్యవసాయ రంగంలో చూసినా మహిళా రైతులు, రైతు కూలీలే కీలకంగా నిలుస్తున్నారని అన్నారు. వారి శ్రమ ఫలితంగానే జిల్లాలో వ్యవసాయోత్పత్తుల దిగుబడులు మూడిరతలు పెరిగాయని కొనియాడారు.

మహిళల పట్ల సమాజ దృక్పథంలో చాలా వరకు మార్పు వచ్చిందని, అయితే ఈ మార్పు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా విస్తరించబడాలని, అప్పుడే నిరక్షరాస్యతతో కూడిన ప్రాంతాల్లోనూ మహిళలకు తగిన గౌరవం, సమానత్వం దక్కుతుందని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మహిళలకు స్థానిక సంస్థల్లో శాసనం ద్వారా యాభై శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తోందని, ఫలితంగా జిల్లాలోని నిజామాబాద్‌ నగరపాల సంస్థ మేయర్‌తో పాటు, మిగతా మూడు మున్సిపాలిటీల్లోనూ అతివలు చైర్‌ పర్సన్లుగా చక్కగా రాణిస్తున్నారని అన్నారు.

మహిళల సంక్షేమం, అభివ ృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ మహిళలు అందరూ తమ శక్తి సామర్ధ్యాలు చాటాలని కలెక్టర్‌ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమ దృష్టితో చూడాలని, లింగ వివక్షత ప్రదర్శించకుండా ఆస్తుల పంపకంలోనూ సమన్యాయం పాటించాలని హితవు పలికారు. చట్టబద్ధంగా కూడా మహిళలు ఆస్తి పంపకంలో సమాన హక్కును కలిగి ఉన్నారని అన్నారు.

అంగన్‌వాడి, ఆశా వర్కర్ల సేవలు మరువలేనివి

కోవిడ్‌ మహమ్మారి కారణంగా గడిచిన రెండు సంవత్సరాల నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఒక మోస్తారుగానే జరుపుకోవాల్సి వచ్చిందని, తిరిగి ఇప్పుడు అట్టహాసంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్‌ అన్నారు. జిల్లాలో కోవిడ్‌ ఉద్ధృతి కొనసాగిన సమయంలో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు అందించిన సేవలు అనితర సాధ్యమని, వారి సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని ప్రశంసించారు.

కోవిడ్‌ భయంతో చాలా మంది సెలవులు పెట్టి విధులకు దూరంగా ఉన్నారని, అలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు భయాన్ని ఛేదిస్తూ పీపీఈ కిట్లు ధరించి మరీ ప్రజలకు కరోనా టెస్టులు నిర్వహించారని కలెక్టర్‌ వారి సేవలను కొనియాడారు.

అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా మాట్లాడుతూ, ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశంలో మహిళలకు ఎంతో గౌరవం ఉందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మహిళలు రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళాభ్యున్నతికి పెద్దపీట వేస్తూ వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని అన్నారు.

ఆడ శిశువు జన్మిస్తే 13 వేల రూపాయలను అందిస్తోందని, వారికి పౌష్టికారం సమకూరుస్తోందని, బాలికల కోసం ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి కార్పొరేట్‌ స్థాయి విద్యను అందిస్తోందన్నారు. ఆడపిల్లలు తల్లితండ్రులకు భారం కాకూడదనే సదాశయంతో వారి వివాహాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి లక్షా 116 రూపాయల చొప్పున ఆర్ధిక సహకారం అందిస్తున్నారని అన్నారు.

వృద్దులు, వితంతువులతో పాటు ఒంటరి మహిళలకు కూడా ఆసరా పెన్షన్లు అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేషంగా సేవలందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యులు సూదం లక్ష్మి, రెడ్‌కో చైర్మన్‌ ఎస్‌.ఏ.అలీం, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, జెడ్పిటీసిలు గడ్డం సుమనా రెడ్డి, బాజిరెడ్డి జగన్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రaాన్సీలక్ష్మి, స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్‌ జ్యోతి, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

రేపు విద్యుత్‌ అంతరాయం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »