కామారెడ్డి, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన భూలక్ష్మికి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై నిజామాబాద్ ప్రైవేటు వైద్యశాలలో ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం నిజామాబాద్‌లో లభ్యం కాకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో వారికి కావాల్సిన రక్తాన్ని పెంజర్ల సురేష్ రెడ్డి సహకారంతో మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు రాజశేఖర్ వెంటనే స్పందించి ఏ పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడారు.
రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు మాట్లాడుతూ ఏ బంధము కాకపోయినా రక్తదానంతో ఆపదలో ఉన్న మహిళలకు సకాలంలో రక్తాన్ని అందజేసి రక్తసంబంధం కంటే ఎక్కువ అనుబంధాన్ని రక్తదాతలదే అన్నారు. గత 14 సంవత్సరాల కాలంలో ఆపదలో ఉన్న వేలాది మంది మహిళల ప్రాణాలను కాపాడడం జరిగిందని, తమ వంతు బాధ్యతగా రక్తలేమితో ఏ ఒక్క మహిళ కూడా ఇబ్బంది పడకూడదని, దానికోసమే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా ముందుంటామని తెలిపారు.
రక్తదానానికి సహకరించిన రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాజు, నవీన్ సతీష్, వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంకు టెక్నీషియన్ చందన్ తదితరులు పాల్గొన్నారు.