బోధన్, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ బసవతారకానగర్లోగల శ్రీ కోట మైసమ్మ సహిత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ 10వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్టు బోధన్ శివసేన అధ్యక్షులు పుసులేటి గోపికిషన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రథోత్సవాన్ని ముఖ్య అతిధులు ప్రారంభించారు. కార్యక్రమంలో బోధన్ ఎసిపి రామారావు, మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి శరత్ రెడ్డి, బోధన్ సిఐ ప్రేమ్ కుమార్, కౌన్సిలర్లు శ్రీకాంత్ గౌడ్, దూప్ సింగ్, పిట్లసత్యం, ఇంద్రకరణ్, ఎస్ఐ మోహన్ రావు, నవీన్ కుమార్, ఆలయ కమిటీ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్, కిషోర్, కృష్ణ, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.