కామారెడ్డి, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సేంద్రియ ఎరువులు తయారు చేసి గ్రామ పంచాయతీ ఆదాయాన్ని పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం పల్లె ప్రగతి పనులపై ఎంపీవోలతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజు గ్రామాల్లో తడి, పొడి చెత్తను చెత్త బండి ద్వారా సేకరించి కంపోస్టు షెడ్‌కి తరలించాలని సూచించారు.
పొడి చెత్తను వేరుగా విక్రయించాలని కోరారు. తడి చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేసి రైతులకు విక్రయించి పంచాయితీల ఆదాయాన్ని పెంపొందించుకోవాలని అని తెలిపారు. వైకుంఠధామంలో నీటి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, డిఎల్పివోలు శ్రీనివాస్, సాయిబాబా పాల్గొన్నారు.