ఆర్మూర్, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సమక్షంలో ఆలూర్ ఎస్ఎంసి చైర్మన్ వెల్మ గంగారెడ్డి, వార్డ్ మెంబెర్ మర్కంటి మహేష్, కాంగ్రెస్ ఎస్.సి.సెల్ నాయకుడు గొంగటి సురేందర్ తెరాస పార్టీలో చేరారు.
వీరికి ఎమ్మెల్యే వారి స్వగృహంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మనఊరు, మనబడి కార్యక్రమాన్ని చేపట్టి మొదటి విడతలో ఆలూర్ పాఠశాలలను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతతో టిఆర్ఎస్ పార్టీలో చేరినట్టు చెప్పారు. జీవన్ రెడ్డి గ్రామ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నందున వారికి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, సొసైటీ ఛైర్మెన్ కళ్లెం బోజారెడ్డి, ఎంపీటీసీ మార్కంటి మల్లేష్, ఉప సర్పంచ్ దుమ్మాజీ శ్రీనివాస్, ఎక్స్ ఎంపీపీ సింగం రవీందర్, నాయకులు బొప్పారం రమేష్, క్రాంతి, బోజన్న ఆలూర్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.