కామారెడ్డి, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బిక్నూర్ సర్కిల్ కార్యాలయంలో ఇటీవలే నూతనంగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య, సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ గౌడ్లను ఆర్టిఐ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు జిల్లా ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం అని ప్రతి ఒక్కరు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని చట్టం పైన విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆర్టిఐ ప్రతినిధులను అభినందించారు.
కార్యక్రమంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు, మోతే లావణ్య, బిక్నూర్ మండల అధ్యక్షుడు కోమ్మరాజుల శ్రీనివాస్, మండల ప్రతినిధులు రవి, డి .రామకృష్ణ, నాగరాజు, స్వామి, మోతే భాస్కర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.