పెండింగ్‌ ఉపకారవేతనాల దరఖాస్తులు పూర్తి చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బిసి శాఖల వారీగా పెండిరగ్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన జిల్లా సంక్షేమ అధికారులతో, కళాశాలల ప్రిన్సిపాళ్లతో పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారులను, ప్రిన్సిపల్‌లకు సూచించారు. ఆధార్‌ అతంటికేషన్‌ కోసం పెండిరగ్‌లో ఉన్న విద్యార్థిని, విద్యార్థులు మీ దగ్గరలోని మీసేవ కేంద్రం నందు ఆధార్‌ అతంటికేషన్‌ చేయించుకోవాలని కోరారు.

కళాశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు ఉపకార వేతనాల కోసం అర్హత ఉన్న ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా షెడ్యూల్‌ కులాల సంక్షేమ అధికారిణి రజిత, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ, జిల్లా బి.సి.సంక్షేమ అధికారి శ్రీనివాస్‌, జిల్లా నోడల్‌ అధికారి షేక్‌ సలాం, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »