కామారెడ్డి, మార్చ్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆతుకూరి మొల్లమాంబను నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి అని కామారెడ్డి జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం ప్రధాన కార్యదర్శి డాకూరి ప్రవీణ్ కుమార్ ప్రజాపతి అన్నారు. కామారెడ్డి జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సంస్కృతంలో ఉన్న రామాయణంను ఐదు రోజులలో అందరికి అర్థమయ్యేవిధంగా తెలుగులో అనువదించింది, అట్టి రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి గాంచిందన్నారు. ఆమె కుమ్మరి కుటుంబంలో జన్మించి కుమ్మరి సామాజిక వర్గానికి మంచి గుర్తింపు తెచ్చిందని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రమేష్ ప్రజాపతి, కామారెడ్డి నియోజకవర్గం అధ్యక్షులు కుమ్మరి చంద్రం ప్రజాపతి, టీచర్ లింగం ప్రజాపతి, టీచర్ శంకర్ ప్రజాపతి, రైతు సమన్వయ కమిటీ కుమ్మరి బాలరాజు ప్రజాపతి, కామారెడ్డి జిల్లా నియోజకవర్గం ఉపాధ్యక్షులు సుభాష్ ప్రజాపతి, మెజీషియన్ సంతోష్ కుమార్ ప్రజాపతి, బిక్షపతి ప్రజాపతి, మల్లేష్ ప్రజాపతి, కుమ్మరి కృష్ణ ప్రజాపతి, రాజంపేట శివ కుమార్ ప్రజాపతి, కుమ్మరి లక్ష్మణ్ ప్రజాపతి, తాడ్వాయి మండల అధ్యక్షుడు సత్యనారాయణ ప్రజాపతి, కులపెద్దలు తదితరులు పాల్గొన్నారు.