టీయూలో మంత్రి జన్మదిన వేడుకలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మరియు ఇండ్లు, రోడ్లు, భవన నిర్మాణాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సౌత్‌ క్యాంపస్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కాంట్రాక్ట్‌) అసోషియేషన్‌ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరై కేట్‌ కట్‌ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సౌమ్యులు, కార్యశీలి, ఇందూరు ముద్దుబిడ్డ మంత్రివర్యులు ప్రశాంత్‌ రెడ్డికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రజలను కంటికి రెప్పలా సంరక్షిస్తూ నిరంతరం ప్రజోపయోగ పథకాల అమలుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు.

తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధికి సాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఉద్యోగాలను ప్రకటించడం టీయూ విద్యార్థుల్లో ఆనందం నెలకొందన్నారు. ఆ ప్రకటనలో భాగస్వామ్యమైన మంత్రివర్యులను వీసీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ (కాంట్రాక్ట్‌) డా. గంగా కిషన్‌, డా. నారాయణ తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

అనంతరం వీసీ తరగతి గదుల్లో జరుగుతున్న పాఠ్యాంశ బోధనలను పర్యవేక్షించారు. విభాగాలను సందర్శించి అధ్యాపకుల హాజరు శాతాన్ని పరిశీలించారు. విద్యార్థులు వివిధ సౌకర్యాలపై వినతి పత్రం అందించారు. కాంపిటేటీవ్‌ సెల్‌, లైబ్రరీలో బుక్స్‌, గ్రౌండ్‌ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయాన తెలిపారు. హాస్టల్‌ వసతి గృహాలను సందర్శించి అక్కడి సిబ్బందితో మాట్లాడారు.

తెలంగాణ విశ్వవిద్యలయంలోని ప్రధాన క్యాంపస్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఆవరణంలో టిఆర్‌ఎస్‌వి, విద్యార్థి జెఎసి ఆధ్యర్యంలో మంత్రివర్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ ఆచార్య సిహెచ్‌. ఆరతి హాజరై కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పచుకున్నారు. ఇందులో డా. వి. త్రివేణి, డా. అబ్దుల్‌ ఖవి, ఉమారాణి, డా. శ్రీనివార్‌ గౌడ్‌,యెండల ప్రదీప్‌, మధుకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 బుధవారం, డిసెంబరు 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »