అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు బుధవారం (జూన్ 10) ప్రారంభించారు.. రుద్రాబిషేకంతో ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. రామమందిర పరిధిలోని కుబేర్ తిల ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అతికొద్ది మంది ప్రముఖులతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
శివ పూజతో మొదలు..
కుంబేర తిలక ఆలయంలో పూజలు..
శివుడికి రాముడు తొలిపూజ నిర్వహించిన సంప్రదాయాన్ని పాటించి ఆలయ భూమి పూజకు ముందు శివున్ని పూజించారు.కుబేర తిల ఆలయం చాలా పురాతన శివాలయం. ఉదయం 8 గంటలకు శివాలయంలో పూజలు ప్రారంభించారు