NizamabadNews

అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేలా గుణాత్మక విద్యను బోధించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేందుకు వారిలో అభ్యాసన సామర్థ్యాలు పెంపొందిస్తూ గుణాత్మక విద్యను బోధించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. తన తల్లిదండ్రులు చిట్ల ప్రమీల – జీవన్‌ రాజ్‌ పేరిట నెలకొల్పిన చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ స్వీయ పర్యవేక్షణలో బుధవారం పెర్కిట్‌లో విద్యా స్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. …

Read More »

నామినేషన్ల స్వీకరణకు సిద్దంగా ఉండాలి…

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నామినేషన్ల స్వీకరణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌ రెడ్డికి సూచించారు. బుధవారం కామారెడ్డి ఆర్‌.డి.ఓ. కార్యాలయంలో నియోజకవర్గ నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు అభ్యర్థులకు అందజేయవలసిన ఫారం-2బి, అఫిడవిట్‌ ఫారం-26, …

Read More »

నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ళు జైలుశిక్ష

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రసారాలు, ప్రచురణలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశమున్నందున ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 లోని సెక్షన్‌ 126 -ఎ ప్రకారం ఎటువంటి ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించరాదని, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచురణలు, …

Read More »

సోనియా నిర్ణయంతో తెలంగాణ ఆవిర్భావం

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోనియాగాంధీ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదని తెలంగాణ రాష్ట్ర మిచ్చిన కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్మోహన్‌ కోరారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో గడపగడపకు మదన్‌ మోహన్‌ కార్యక్రమం నిర్వహించారు. కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. మండల కేంద్రంలో మాట్లాడుతూ, 29వ రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరణతో గెలిపించాలని …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, నవంబరు 1, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : చవితి రాత్రి 10.48 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : రోహిణి ఉదయం 6.08యోగం : పరిఘము సాయంత్రం 5.09 వరకుకరణం : బవ ఉదయం 10.51 వరకు తదుపరి బాలువ రాత్రి 10.48 వరకు వర్జ్యం : ఉదయం 11.53 – 1.31దుర్ముహూర్తము : ఉదయం 11.21 …

Read More »

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ నిషేధం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించరాదని, అలాంటి వార్తలను ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రసారం చేయడం, ప్రింట్‌ మీడియాలో ప్రచురించడం గానీ చేయరాదన్నారు. 7 …

Read More »

భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ చాలీసా పారాయణము

ఆర్మూర్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ జర్నలిస్ట్‌ కాలనీ శ్రీ భక్త హనుమాన్‌ ఆలయంలో ప్రతీ మంగళవారం మాదిరిగానే ఈ మంగళ వారం కూడా హనుమాన్‌ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో హనుమాన్‌ చాలీసా పారాయణము చేశారు. భక్త హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో భక్తులు నిలబడి సామూహికంగా హనుమాన్‌ చాలీసా పారాయణము చేశారు. అనంతరం మంగళ హారతి ఇచ్చారు, జై శ్రీరామ్‌, …

Read More »

ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌ను పరిశీలించిన రైతు సంఘాల నాయకులు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్‌ పంప్‌ హౌజ్‌ను మంగళవారం అఖిల భారత రైతు సంఘాల నేతలు సందర్శించారు. కాళేశ్వరం జలాల 300 కిలో మీటర్ల నుండి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎదురెక్కించి ఎస్సారెస్పీలో నింపే ప్రక్రియను రైతు నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు వారికి వివరించారు. సీఎం కేసిఆర్‌ వల్లే ఇది …

Read More »

రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాల్యాద్రి రెడ్డి

బాన్సువాడ, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాల్యాద్రి రెడ్డి మంగళవారం హైదరాబాదులోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి రేవంత్‌ రెడ్డి మల్యాద్రి రెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో బారస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని ఎన్నికల్లో ఓడగొట్టడమే …

Read More »

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయం సమీపంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ తో కలిసి కౌంటింగ్‌ గదులను పరిశీలించి వాటిని వెంటనే శుభ్రపరచి పెయింటింగ్‌తో రెండు రోజులల్లో సిద్ధం చేయవలసినదిగా సూచించారు. జుక్కల్‌, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »