కామారెడ్డి, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పౌరసరఫరాల సమస్త ఆధ్వర్యంలో నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా అధికారులు రైతుల నుంచి కొనుగోలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం అధికారులు, రైస్ మిల్ యజమానులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో 2,92,105 …
Read More »పోలింగ్ విధులపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి
నిజామాబాద్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత శాసన సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30 న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లచే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. ప్రిసైడిరగ్ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్ అధికారులకు నిజామాబాద్ జిల్లా …
Read More »ప్రజల చందాలతో గెలిచి పత్తా లేకుండా పోయారు…
కామారెడ్డి, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల చందాలతో గెలిచి వారికి అందుబాటులో లేకుండా పత్తా లేకుండా పోయిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ను తరిమి కొట్టాలని గ్రామాలలో నిలదీయాలని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కలకుంట్ల మదన్ మోహన్ రావు కార్యకర్తలకు చెప్పారు. మండల కేంద్రంలో గడపగడప కాంగ్రెస్ ప్రచారం చేపట్టి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి …
Read More »కలెక్టరేట్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ
నిజామాబాద్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు కలెక్టరేట్ అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి అంకితభావంతో కృషి చేస్తానని, తోటి వారందరిలో ఈ భావనను పెంపొందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని, సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికతతో దేశానికి …
Read More »కామారెడ్డిలో బిఆర్‌ఎస్‌కు భారీ షాక్…
కామారెడ్డి, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీఆర్‌ఎస్ పార్టీకి కామారెడ్డిలో భారీ షాక్ తగిలింది. కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా రాజీనామ చేశారు. రాజీనామా లేఖను కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంకే ముజీబొద్దీన్‌కు అందజేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి 16వ వార్డు కౌన్సిలర్ చాట్ల వంశీ కూడా రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు కనపర్తి అరవింద్, బిసి సెల్ సెక్రటరీ …
Read More »నిర్భయంగా ఓటు వేస్తానని ప్రతిజ్ఞ
కామారెడ్డి, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులో పనిచేస్తున్న సిపాయిల సేవలు వెలకట్టలేనివాని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవంగా సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జాతీయ సమైక్యత, సమగ్రతలను కాపాడుతూ, దేశ రక్షణ కోసం తమ కుటుంబాలకు దూరంగా సరిహద్దులో …
Read More »మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి
బీర్కూర్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 39 వ వర్ధంతిని మంగళవారం బీర్కూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయిని శంకర్ మాట్లాడుతూ పేదరికం పారద్రోలెందుకు ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారన్నారు. బ్యాంకులను జాతీయ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడు, …
Read More »సాధారణ పరిశీలకులకు ముఖ్య గమనిక
కామారెడ్డి, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ పరిశీలకులకు లయజన్ అధికారులుగా నియమించిన వారు అయా నియోజక వర్గాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కలిగి ఏ విషయం అడిగిన తడబాటు లేకుండా సమాధానం చెప్పేలా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జుక్కల్, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులతో పాటు వ్యయ పరిశీలకులు జిల్లాకు రానున్నందున ఆర్‌అండ్‌బిలో …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, అక్టోబరు 31, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 10.53 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : రోహిణి పూర్తియోగం : వరీయాన్ సాయంత్రం 6.27 వరకుకరణం : వణిజ ఉదయం 11.11 వరకు తదుపరి భద్ర రాత్రి 10.53 వరకు వర్జ్యం : రాత్రి 10.04 – 11.41దుర్ముహూర్తము : ఉదయం 8.18 – …
Read More »గ్లోబల్ టీచర్ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయుడు
కామారెడ్డి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతిష్టాత్మకమైన ఏకెఎస్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎంపిక చేసిన 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులలో కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్‌కి గ్లోబల్ టీచర్ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ అవార్డును వచ్చే నెల 4వ తేదీన ఢల్లీిలోని వివంత తాజ్ …
Read More »