NizamabadNews

మధ్యాహ్న భోజన పథకం కమిటీ ఎన్నిక

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం మధ్యాహ్న భోజనం పథకం (ఏఐటీయూసీ) కార్మికుల విస్తృతస్థాయి సమావేశం ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశం యూనియన్‌ జిల్లా నాయకులు సాయమ్మ అధ్యక్షతన జరిగింది. ఇందులో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పనిభద్రత, పిఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

ఇంటి నెంబరు తప్పుంటే అప్‌డేట్‌ చేసుకోవచ్చు

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫామ్‌ -8 నింపి మీ డోర్‌ నెంబర్‌ అప్డేట్‌ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం ఓటర్ల జాబితాల తప్పుల సవరణపై రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్‌ జాబితాలో మీ ఇంటి నెంబర్లు తప్పుగా ఉంటే గుర్తించి ఫామ్‌ -8 నింపి …

Read More »

బకాయి వేతనాలు, బిల్లులు వెంటనే చెల్లించాలి

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా జనరల్‌ బాడీ సమావేశం నిజామాబాద్‌లో గల కేర్‌ డిగ్రీ కళాశాలలో సాయమ్మ అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వైఓమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తామని హాజరు శాతం పెంచుతామని మాటల్లో చెబుతున్నా వాటికి తోడ్పాటును అందిస్తున్న …

Read More »

స్పాట్‌ వాల్యుయేషన్‌ డబ్బులు వెంటనే విడుదల చేయాలి

ఆర్మూర్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ పేమెంట్‌ డబ్బులను వెంటనే విడుదల చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2023 ఏప్రిల్‌ 21 వరకు స్పాట్‌ వాల్యుయేషన్‌ ముగిసినప్పటికీ ఇప్పటివరకు పేమెంట్‌ ఇవ్వకపోవడం సరికాదని ఆయన అన్నారు. కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఇంటర్మీడియట్‌ లెక్చరర్‌లకు వేసవిలో వేతనాలు లేక అవస్థలు పడుతున్న విషయం ఈ ప్రభుత్వానికి …

Read More »

రెండువేల నోటుపై కవిత

నిన్ను చూసి ఎన్నిరోజులైందో ?నీ స్పర్శ లేక ఎన్నినెలలు దాటిందో?నీకేం, ఎక్కడున్నా బానే ఉంటావ్‌,తళతళా మిళమిళలతో, నవ్వకుఏం బాగు అది? చీకటిగదిలో బిక్కుబిక్కుమంటూఒంటరిగా,ఏసిలో ఉన్నా నీకు చెమటలేగా !సరెలే, నీలాంటి సోపతితోనే నీకేం ధైర్యం వస్తది?నలుగురితో ఉండాలనలుగురిలో ఉండాల,చెమట చేతులను తాకినపుడునీవు కడుపునింపే అన్నమైనావు,కష్టాల జేబులలో దూరినపుడునీవు కండ్ల నిండా పండుగైనావు,చదువులను గట్టెక్కించే దారివైనావు,పెళ్ళిలను వెలిగించే దీపమైనావు,అదంతా గతమే,నీవు లేక ఏళ్ళే గడిచే,ఏదో వలసవెళ్ళినట్లు-ఐనా ఎప్పటికైనా నిన్ను చూస్తం లే …

Read More »

ఎంపీ అరవింద్‌ సమక్షంలో బీజేపీలోకి

ఎడపల్లి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని జమ్లం గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్‌ సర్పంచ్‌ గొడుగు రాజ్యలక్ష్మి హన్మంతు దంపతులు హైదరాబాద్‌లో నిజామాబాదు ఎంపీ అరవింద్‌ సమక్షంలో శుక్రవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. సర్పంచ్‌ గొడుగు రాజ్యలక్ష్మి హన్మంతు దంపతులు బోధన్‌ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి, వడ్డీ మోహన్‌ రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా, పార్టీలో చేరిన వారికి ఎంపీ అరవింద్‌ …

Read More »

మైనారిటీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న మైనారిటీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మొహమ్మద్‌ ఇంతియాజ్‌ ఇసాక్‌ అన్నారు. శుక్రవారం ఆయన నిజామాబాద్‌ అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ తారిఖ్‌ అన్సారీలతో కలిసి నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్‌ టెలిఫోన్‌ కాలనీలో గల …

Read More »

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

ఆలూరు, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను క్యాబినెట్‌లో ఆమోదించిన శుభ సందర్భంగా ఆలూర్‌ మడలంలోని తహసీల్దార్‌ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి, మంత్రులకు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి చిత్రపటాలకు వీఆర్‌ఏలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలూర్‌ మండల అధ్యక్షులు గున్నం సంతోష్‌, ప్రధాన కార్యదర్శి …

Read More »

అక్రమ క్వారీలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి హస్తం

ఆర్మూర్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏర్గట్ల మండలం బట్టాపూర్‌ గ్రామంలో గత ఏడేళ్లుగా పర్యావరణ అనుమతులు లేకుండా నడుస్తున్న క్వారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై విచారణ జరిపి వెంటనే ఈటీఎస్‌ (ఎలక్ట్రానిక్‌ టోటల్‌ స్టేషన్‌) సర్వే నిర్వహించి నిజాలు నిగ్గు తేల్చాలని బాల్కొండ నియోజకవర్గం భారతీయ జనతాపార్టీ నాయకులు మల్లికార్జున్‌ రెడ్డి జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతును కోరారు. ఈ …

Read More »

విశ్వకర్మ సంఘము నూతన కార్యవర్గం ఏర్పాటు

భీంగల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ మున్సిపల్‌ పట్టణ కేంద్రంలోని అయ్యప్ప నగర్‌లో ఉన్న విశ్వకర్మ సంఘం – 2 నూతన కార్యవర్గాన్ని శుక్రవారం అమావాస్యని పురస్కరించుకొని పాత సంఘం భవన నిర్మాణంలో కొన్ని నూతన హంగులతో నిర్మాణం చేపట్టిన వాటి నిర్మాణం పూర్తి కావడంతో విశ్వకర్మ సంఘం సభ్యులు అందరూ కూడా పాతసంఘ భవనాన్ని మరియు నూతనంగా ఏర్పాటు చేసుకున్న షెడ్డు హల్‌ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »