NizamabadNews

లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్‌ చేయాలి

కామారెడ్డి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్ష్యానికి అనుగుణంగా రైస్‌ మిల్లర్లు మిల్లింగ్‌ చేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం రైస్‌ మిల్లర్లతో ధాన్యం మిల్లింగ్‌ లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైస్‌ మిల్‌ యజమానులు లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్‌ చేపట్టకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిఎస్‌ఓ పద్మ, సివిల్‌ సప్లై జిల్లా మేనేజర్‌ అభిషేక్‌ …

Read More »

సొంత అనుభవాన్ని చెప్పిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనుత్తీర్ణత పొందినవారు అసంతృప్తికి లోను కావద్దని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. గురువారం కలెక్టర్‌ మాట్లాడారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ అనుతీర్ణత పొందిన విద్యార్థులకు జీవితంలో ఎన్నో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసి రెండవసారి ప్రయత్నంలో విజయం సాధించవచ్చుని చెప్పారు. విద్యార్థులకు మార్కులు ముఖ్యం కాదని, వారిని తల్లిదండ్రులు తక్కువ అంచనా …

Read More »

బాధిత కుటుంబానికి మంత్రి ఆర్ధిక సహాయం

భీంగల్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన కర్రోళ్ళ అనిల్‌ యాదవ్‌కు చెందిన 48 గొర్రెలు ఇటీవల పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. పిడుగుపాటుకు అనిల్‌ కూడా గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బాధిత అనిల్‌ను గురువారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. గాయాలతో ఇబ్బంది పడుతున్న అనిల్‌కు అందుతున్న …

Read More »

ప్రమాదవశాత్తు పూరిగుడిసె దగ్ధం

ఎడపల్లి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్ధరాత్రి ప్రమాదవశాత్తు పూరిగుడిసెలో మంటలు చెలరేగడంతో గుడిసెలోని వస్తువులన్నీ కాలి బూడిదైన సంఘటన ఎడపల్లి మండలం జానకంపేట్‌ గ్రామంలో చోటుచేసుకొంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఉప్పు భూమయ్యకు చెందిన పూరిగుడిసెలో బుధవారం అర్థరాత్రి 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కాలనీ వాసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అర్పివేసే ప్రయత్నాలు చేశారు. …

Read More »

సర్వే నెంబరు 952 స్థలాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోస్రా శివారులోని సర్వే నెం. 952 పరిధిలో గల స్థలాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్‌ మీనా, ఇతర రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులతో కలిసి మ్యాప్‌లు, రికార్డుల ఆధారంగా అటవీ, రెవెన్యూ సరిహద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పలువురు రైతులు పంటలు సాగు చేస్తున్న …

Read More »

ఉద్యోగులు సేవాభావం అలవరుచుకోవాలి

కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంకితభావంతో పని చేసిన ఉద్యోగులు సమాజంలో గుర్తింపు పొందుతారని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదోన్నతి పై వెళ్లిన ఎల్డీఎం చిందం రమేష్‌ కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు సహజమన్నారు. ఉద్యోగులు సేవాభావం అలవర్చుకోవాలని చెప్పారు. …

Read More »

పది ఫలితాల్లో కృష్ణవేణి హైస్కూల్‌ విజయభేరి

ఆర్మూర్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఆర్మూర్‌ మున్సిపల్‌ కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూల్‌ విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఆర్‌. అశ్లేష అనే విద్యార్థిని 10.10 జిపిఏ సాధించడం పట్ల కృష్ణవేణి డైరెక్టర్‌ విజయ్‌ కర్తన్‌, ప్రిన్సిపాల్‌ మిన్‌ వాజ్‌ ఉపాధ్యాయులు ఆమెను అభినందిచారు.

Read More »

ఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌ నూతన కమిటీ

ఆర్మూర్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో ఆర్మూర్‌ నియోజకవర్గ ఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌ నూతన కమిటీ ఎన్నికలను యల్లారములు మెమోరియల్‌ హల్‌లో బుధవారం నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా గణేష్‌ గౌడ్‌, కార్యదర్శిగా సందీప్‌, కోశాధికారిగా అమృతల శ్రావణ్‌లను ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సీనియర్‌ పాత్రికేయులు నూతన అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా …

Read More »

బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం

ఆర్మూర్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన కుర్మ కర్రోళ్ల అనిల్‌ గొర్రెలు మేపడానికి అడవికి వెళ్ళాడు. మధ్యాహ్నం ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో అనిల్‌ గొర్రెలను అన్నిటినీ చెట్టు కిందికి తోలాడు. హఠాత్తుగా ఆ చెట్టుపై పిడుగు పడడంతో 48 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అక్కడే ఉన్న అనిల్‌కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఈ …

Read More »

ఈనెల 31న హరిదా రచయితల సంఘం మహాసభ

నిజామాబాద్‌, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మే 31న హరిదా రచయితల సంఘం నిర్వహించనున్న సాహిత్య మహాసభ విజయవంతం కావాలని శాసనమండలి సభ్యులు, భారత్‌ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. బుధవారం అర్బన్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, నిజామాబాద్‌ నగర మేయర్‌ నీతు కిరణ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »