NizamabadNews

కాంగ్రెస్‌ పార్టీలో భారీ చేరికలు

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివ నగర్‌ మండలం ఉత్నూరు, ధర్మారావు పెట్‌, సదాశివ నగర్‌ గ్రామనికి చెందిన బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన సీనియర్‌ నాయకులు, యువకులు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలలో వడ్డెపల్లి సుభాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు వారు తెలిపారు. వీరికి కాంగ్రెస్‌ పార్టీ …

Read More »

త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ…

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ ఏప్రిల్‌ 14న వైభవోపేతంగా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి గొర్రెల పంపిణీ, అంబేడ్కర్‌ జయంతి …

Read More »

పరీక్ష కేంద్రం తనిఖీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను గురువారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లోని మౌలిక వసతుల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య సిబ్బందిని …

Read More »

జల సంరక్షణ పనులు చేపట్టాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా చూడాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశం మందిరంలో గురువారం ఉపాధి హామీ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో జల సంరక్షణ …

Read More »

ఈనెల 20 తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలు…

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 20 తర్వాత యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేస్తామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం రైస్‌ మిల్లుల యజమానులు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. యాసంగిలో మిల్లింగ్‌ చేసే రైస్‌ మిల్లుల వివరాలను రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ …

Read More »

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ వేడుకలో ప్రజలను భాగస్వాములు చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నెల 14 వ తేదీన హైదరాబాద్‌ లో నిర్వహించతలపెట్టిన అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ వేడుక కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భాగస్వాములు చేయాలని సంకల్పించడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి అన్నారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఆమె అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ, …

Read More »

అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ కు సంబంధించి జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌ లో కలెక్టర్‌ వ్యవసాయ శాఖ అధికారులతో ఎరువుల సమీకరణ, వాటి పంపిణీ, ప్రస్తుతం పంటల సాగు స్థితిగతులు, రబీలో …

Read More »

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌లు, కంట్రోల్‌ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. ఇటీవలే పూర్తయిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. …

Read More »

9న బహుభాషా కవి సమ్మేళనం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బహుభాషా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నారు. అంశం భారత దేశ ప్రజలు సామరస్య సహజీవనం, కావున నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలోని తెలుగు హిందీ, ఉర్దూ, భాష పండితులందరూ అంశంపై మంచి కవిత్వాన్ని రాసి జమీలుల్లా, కె.వి రమణ చారి, గంట్యాల ప్రసాద్‌, బి .ప్రవీణ్‌ కుమార్‌, మాక్బూల్‌ హుస్సేన్‌ …

Read More »

కామారెడ్డిలో మెగా ఉద్యోగ మేళా

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ వారు నిర్వహిస్తున్న టెక్‌ బి ప్రోగ్రాం కొరకు 2022Ê23 ఎంపిసి / ఎంఇసి లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈనెల 8వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అర్హత పదో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »