నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు నిజామాబాద్ పట్టణంలోని ఖలీల్‌వాడిలోగల శివగంగ ఇ.ఎన్.టి. ఆసుపత్రిలో అర్హతలేని వైద్యురాలు మార్చి 17వ తేదీన అబార్షన్ చేయడం జరిగిందని, కాగా సదరు ఆసుపత్రిని బుధవారం సీజ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్, డాక్టర్ వి.రాజేశ్, బి. గంగాధర్ తదితరులున్నారు.
Read More »ఆర్మూర్‌లో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్దం
ఆర్మూర్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం అర్ధరాత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ని రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా, అక్రమంగా, అన్యాయంగా పోలీసులను ఉసిగొలిపి ఎందుకు అరెస్టు చేశారో తెలపకుండానే పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని కెనాల్ బ్రిడ్జి పైన కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రాష్ట్ర …
Read More »దన్నూర్‌లో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
బోత్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోత్ మండలం దన్నూర్ బి గ్రామ స్థానిక బస్టాండ్‌లో మాజీ ఉపప్రధాని బాబుజగ్జీవన్ రామ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దన్నూరు గ్రామ వీడీసీ చైర్మన్ బుచ్చన్న మాట్లాడుతూ దళితుల కోసం కొట్లాడిన మహనీయుడు, అణగారిన వర్గాలను అభ్యున్నతిలోకి తీసుకురావడానికి పోరాడిన యోధుడు, జనం కోసమే జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి జరుపుకోవడం …
Read More »బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం
నందిపేట్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్ధరాత్రి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్ట్ కు నిరసనగా బుధవారం నందిపేట్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన బండి సంజయ్‌ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు భూతం సాయరెడ్డి, జిల్లా సెక్రెటరీ పోతుగంటి సురేందర్, కిషోర్ …
Read More »ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
నిజామాబాద్, ఏప్రిల్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నిజామాబాద్ నగరంలో ఆయన విగహ్రానికి నివాళులు అర్పించారు. రక్షణ మంత్రిగా పాకిస్తాన్ పై విజయం, వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవం, కార్మిక శాఖ మంత్రిగా కార్మికులకు హక్కులు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆయనే ఒక విజయం అని వక్తలు పేర్కొన్నారు. భారతదేశం ఒక పుస్తకం …
Read More »ఉచిత శిక్షణ ఉపాధి కల్పన
కామారెడ్డి, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండల కేంద్రంలో దేవునిపల్లి, విద్యుత్ నగర్‌లో ఉన్న అక్షయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా గ్రామీణ మహిళలకు గృహినీలకు స్వయం ఉపాధి శిక్షణ సంస్థగా అక్షయ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో లేడీస్ టైలరింగ్ మగ్గం వర్క్, బ్యూటీ పార్లర్ మెహేంది డిజైనింగ్, కోర్సులలో అత్యంత ఆధునిక పద్ధతి ద్వారా అనగా కరెంటు మిషన్స్ ద్వారా ప్రొజెక్టర్ డిజిటల్ …
Read More »’పది’ పరీక్షలకు మరింత పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షలను కట్టుదిట్టమైన ఏర్పాట్లతో మరింత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ నెల 03వ తేదీ నుండి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. …
Read More »నిర్లక్ష్యంగా వ్యవహరించే శాఖలపై చర్యలు తీసుకుంటాం
కామరెడ్డి, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే శాఖలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, విద్యాశాఖ అధికారులతో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పరీక్షలు జరిగే సమయంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. …
Read More »ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో లక్ష్మి (64) వృద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తమై ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో బీబీపేట మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పైదం భాస్కర్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి ఏ పాజిటివ్ రక్తాన్ని వీటి ఠాగూర్ రక్తనిది కేంద్రంలో అందజేయడం జరిగిందని అన్నారు. …
Read More »పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
కామారెడ్డి, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమాన్ జయంతి, రంజాన్ పండుగలను పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. శోభాయాత్ర సమయంలో సమయ పాలన పాటించాలన్నారు. పండగల సమయంలో సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించవద్దని సూచించారు. పండగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా …
Read More »