కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటిని చక్కదిద్దే మహిళ ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఇంటా సౌభాగ్యం ఉంటుందని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శోభ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఐసి డిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం సిఎం కేసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం …
Read More »భూదేవికి ఉన్నంత ఓర్పు మహిళలకు ఉంది
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ – మెప్మా ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల వడ్డీ రాయితీ నిదుల పంపిణీ కార్యక్రమంలో మొపాల్ మండలంలోని బోర్గం గ్రామంలో ఉన్న మోటాటి రెడ్డి కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యఅతిథిగా …
Read More »భారత జాగృతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని మంజీరా కళాశాలలో పలువురు మహిళలను జాగృతి సభ్యులు సన్మానించారు. స్వయంకృషి తో కస్టపడి పనిచేసుకుంటూ కుటుంబ బారాన్ని మోస్తూ ఎదుగుతున్న మహిళా మనులను శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరం భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు అనంత రాములు …
Read More »మహిళా ఆరోగ్య హెల్ప్ డెస్క్ ప్రారంభం
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఆరోగ్య హెల్ప్ డెస్క్‌ను జడ్పీ చైర్పర్సన్ శోభ ప్రారంభించారు. రిఫరల్ సెంటర్‌ను మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 8 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తుందని తెలిపారు. ప్రతి మంగళవారం పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాలోని మహిళలు ఈ అవకాశాన్ని …
Read More »మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ రుణాలు చెక్కులను అందజేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గర్భిణీల కోసం కెసిఆర్ న్యూట్రిషన్ …
Read More »సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ప్రశంసనీయం
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని వక్తలు కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ మరింత అభివృద్ధిని సాధించాలని వారు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్ లో అట్టహాసంగా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో జిల్లా …
Read More »రెంజల్ లో ఘనంగా ఎమ్మెల్యే షకీల్ జన్మదిన వేడుకలు
రెంజల్, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో మంగళవారం బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ 47వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ కు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు. నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న …
Read More »దాతృత్వం చాటుకున్న సాటపూర్ సర్పంచ్
రెంజల్, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలంలోని పోతంగల్ గ్రామానికి చెందిన గోసంగి నవీన్, లత అప్పుల బాధలతో ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో వారి ముగ్గురు కూతుళ్లు సహస్ర, నాగలక్మీ, విష్ణు ప్రియలు ఆనాధలుగా మారారు. దీంతో చిన్నారుల పరిస్థితిని చూసి చలించిపోయిన రెంజల్ మండలం సాటాపూర్ గ్రామ సర్పంచ్ వికార్ పాషా పిల్లల పేర్లపై రూ.5000 రూపాయల చొప్పున ముగ్గురికి 15000 రూపాయలు …
Read More »మండలంలో ఘనంగా హోలీ సంబరాలు
రెంజల్, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి, కందకుర్తి, బాగేపల్లి గ్రామాలలో మంగళవారం ఘనంగా హోలీ పండుగను నిర్వహించారు. సోమవారం రాత్రి కామదహనం చేసి మంగళవారం హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. రసాయన రంగులకు దూరంగా ఉంటూ గోగుపులూ, పసుపుతో తయారు చేసిన రంగునీళ్లు చల్లుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు సంతోషాల మధ్య రంగులు చల్లుకుని హోలీ వేడుకలు ఘనంగా …
Read More »కామారెడ్డిలో ఘనంగా హోలీ సంబరాలు
కామారెడ్డి, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంగులు కలిసి ఉన్నట్లు ఉద్యోగులు కలిసి ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని ప్రకృతి వనంలో జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం, టీఎన్జీవోఎస్, టీజీవోఎస్ ఆధ్వర్యంలో మంగళవారం హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాలకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హోలీ పండుగ సందర్భంగా ఒకరిపై ఒకరు చల్లుకునేది రంగులు …
Read More »