NizamabadNews

ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 15 నుండి ఏప్రిల్‌ 4 వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుండగా, పదవ తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 3 …

Read More »

తారిఖ్‌ అన్సారీకి మంత్రి వేముల శుభాకాంక్షలు

హైదరాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్‌ కమిషన్‌ నూతన ఛైర్మన్‌ తారిఖ్‌ అన్సారీ శనివారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని మినిస్టర్‌ క్వార్టర్స్‌లోని అధికారిక నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తనకు సహకరించినందుకు మంత్రికి దన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా తారిక్‌ అన్సారీకి మంత్రి వేముల పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. స్వీట్‌ తినిపించి …

Read More »

కామారెడ్డిలో తక్కువ ధరకే ప్లాట్లు

కామరెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ధరణి టౌన్షిప్‌ ఫ్రీ బిడ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. 44 నెంబర్‌ జాతీయ రహదారి పక్కన ధరణి టౌన్షిప్‌లో ఉన్న గృహాలు, ప్లాట్లను తక్కువ ధరకే పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల …

Read More »

ఇద్దరు కూలీలు మృతి

నవీపేట్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలంలోని జన్నేపల్లి గ్రామంలో గల బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌ రావు అతిథి గృహంలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జన్నెపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. నిజామాబాద్‌ నగరానికి చెందిన రాజు, మరో కూలి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అతిథి గృహంలో పనిచేస్తుండగా ఈ విషాదకర సంఘటన …

Read More »

తెయులో అంతర కళాశాలల చదరంగ పోటీలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటి అంతర కళాశాలల చదరంగ పోటీలు, ఎంపికలను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల సెమినార్‌ హాల్‌లో నిర్వహించినట్టు వర్సిటీ క్రీడా విభాగం డైరెక్టర్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ డా.టి. సంపత్‌ తెలిపారు. పోటీలు ప్రారంభ మరియు ముగింపు కార్య క్రమానికి ముఖ్యఅతిధిగా యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌. ఆరతి హజరై …

Read More »

దివ్యాంగుల పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి

రెంజల్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో ఉన్న దివ్యాంగుల పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ సందర్శించారు. దివ్యాంగ విద్యార్థులకు బోధించే బోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులకు విద్యను బోధించే తీరు బాగుందని ఉపాధ్యాయులను అభినందించారు. ఆయన వెంట ఎంఇఓ గణేష్‌ రావు, సర్పంచ్‌ వికార్‌ పాషా, ఉపాధ్యాయులు విశ్వనాథన్‌, మహాజన్‌ తదితరులు ఉన్నారు.

Read More »

కస్తూర్బా గాంధీ పాఠశాలలు సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి

రెంజల్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ సందర్శించారు. పలు రకాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఆయన వెంట ఎంఇఓ గణేష్‌ రావు, పాఠశాల ప్రత్యేకాధికారి శ్యామల, ఉపాధ్యాయురాలు …

Read More »

మన ఊరు- మనబడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి…

రెంజల్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్వహించిన మన ఊరు- మనబడి కార్యక్రమ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ అన్నారు.శుక్రవారం మండలంలోని మొదటి విడతలో ఎంపికైన వీరన్న గుట్ట,సాటాపూర్‌, నీలా, బోర్గం పాఠశాలలను మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మండల ప్రత్యేక అధికారి రాములతో కలిసి ఆయన సందర్శించారు. పాఠశాలల్లో చేపడుతున్న భవనాల …

Read More »

నీలాలో సిసి రోడ్డు పనులు ప్రారంభం

రెంజల్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా గ్రామంలో శుక్రవారం సిసి రోడ్డు పనులకు స్థానిక సర్పంచ్‌ లలిత రాఘవేందర్‌, వైస్‌ ఎంపీపీ యోగేష్‌ ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల ద్వారా మంజూరైన రూ. 20 లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని వారన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ స్వప్న రాంచందర్‌, ఉపసర్పంచ్‌ నాగభూషణం, నాయకులు సుభాష్‌, గాఫర్‌, అక్తర్‌, ఇమ్రాన్‌ …

Read More »

చిన్నారికి సకాలంలో రక్తం అందజేత…

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా టేక్రియాల్‌ గ్రామానికి చెందిన చిన్నారి బిందుశ్రీకి గుండె ఆపరేషన్‌ నిమిత్తమై నిమ్స్‌ వైద్యశాల హైదరాబాదులో బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సుదీర్‌ సహకారంతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »