NizamabadNews

మామిడిపల్లి హైస్కూల్లో క్షయ వ్యాధిపై అవగాహన

ఆర్మూర్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి హైస్కూల్లో శుక్రవారం విద్యార్థులకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి పర్యవేక్షకులు సంతోష్‌ మాట్లాడుతూ క్షయ లేదా టి.బి. అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటు వ్యాధి, టిబి బాక్టీరియం సాధారణంగా దగ్గు మరియు తుమ్ముల సమయంలో గాలిలోకి విడుదలయ్యే చిన్న బిందువుల ద్వారా …

Read More »

కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి

గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు రాగా వాటితోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఏనుగు రవీందర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గాంధారి మండలంలోని శక్తి కేంద్రాలలో నిర్వహించిన కార్నర్‌ సమావేశాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా మండలంలోని సితాయిపల్లి …

Read More »

విద్యార్థులు సోషల్‌ అవేర్నస్‌ కలిగి వుండాలి

గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులు సోషల్‌ అవేర్నస్‌ కల్గివుండాలని ఎఫ్‌ఎల్‌ఎన్‌ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడిరది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పాఠశాలను స్టేట్‌ టీం సందర్శిస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా శుక్రవారం గాంధారి మండలంలోని జిల్లా పరిషత్‌, ప్రాథమిక పాఠశాలను సందర్శించిన రాష్ట్ర కమిటీ విద్యార్థులతో మాట్లాడారు. రాష్టంలో విద్యాశాఖ నూతనంగా అమలు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా …

Read More »

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాకతీయ మెడికల్‌ కాలేజీలో వైద్యావిద్యను అభ్యశిస్తున్న దరావత్‌ ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన నిందితుడు సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని ఎల్లారెడ్డి గోర్‌ సేనా ఇంచార్జి లక్ష్మణ్‌ రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం గాంధారి తహసీల్దార్‌ గోవర్ధన్‌కు గోర్‌ సేనా తరుపున వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని నిందితుడిని కఠినంగా శిక్షిస్తే భావితరాలకు ఉపయోగకరంగా …

Read More »

మంజీర డిగ్రీ కళాశాలలో రిక్రూట్మెంట్‌ డ్రైవ్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల మంజీర డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శనివారం టాస్క్‌ సహకారంతో ప్రముఖ ఎంఎస్‌ఎన్‌ లాబొరేటిరీస్‌ కార్పొరేట్‌ కంపెనీలో 100 ఉద్యోగాలకు బీఎస్సీ, బీకాం, బి.ఎ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి నిరుద్యోగులందరికీ రిక్రూమెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్‌ గురువేందర్‌ రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు తమ యొక్క …

Read More »

వారంలో రెండురోజులు పర్యవేక్షించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ స్కూల్లు వారంలో రెండు రోజులు మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జాతీయ ఆహార భద్రత యాక్ట్‌ 2013 పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జరై రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌ రెడ్డి మాట్లాడారు. విద్యార్థులకు …

Read More »

తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల అయింది. ఈ నెల 28న ఎంసెట్‌, పీజీ ఈ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. వచ్చే నెల 3 నుండి దరఖాస్తుల స్వీకరణ కూడా జరుగనుంది. ఏప్రిల్‌ 10 వరకు ఎంసెట్‌ దరఖాస్తుకు అవకాశం ఉండనుంది. పీజీ ఈ సెట్‌కి ఏప్రిల్‌ 30 …

Read More »

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే

లింగంపేట్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట్‌ మండల ముంబాజిపేట్‌ తాండ కి చెందిన బి.ఆర్‌.ఎస్‌ కార్యకర్త పరశురామ్‌, బానోత్‌ గోపాల్‌ బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో ఢీ కొని తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కి సమాచారం అందించిన వెంటనే హుటాహుటిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అపెక్స్‌ హాస్పిటల్‌కు వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి అధైర్యపడొద్దని తాను అండగా …

Read More »

ఘనంగా సంత్‌ గాడ్గే బాబా జయంతి

ఎడపల్లి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశుభ్రత దైవంగా నిర్వచించి.. స్వచ్ఛత కోసం పరితపించి.. చీపురుతో వీధులను.. తన భక్తి కీర్తనలతో ప్రజల మనసులను పరిశుభ్రం చేసిన సంఘ సంస్కర్త, వాగ్గేయ కారులు సంత్‌ గాడ్గే బాబా అని ఎడపల్లి మండల రజక సంఘం ప్రధాన కార్యదర్శి మల్లెపూల శ్రీనివాస్‌ అన్నారు. ఈ మేరకు సంత్‌ గాడ్గే బాబా 147వ జయంతిని ఎడపల్లి మండల కేంద్రంలో …

Read More »

ధాత్రి టౌన్‌ షిప్‌ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్‌ షిప్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. తొలివిడతగా గత నవంబర్‌ మాసంలో వేలం పాట నిర్వహించిన ప్లాట్లను పరిశీలించి, వాటికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. టౌన్‌ షిప్‌ లో మౌలిక సదుపాయాల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »