NizamabadNews

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రెంజల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన పల్లె సాయిలు (35) అనే వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 14వ తేదీన అనారోగ్య కారణంగా పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ …

Read More »

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సి.ఎస్‌ సమీక్ష నిర్వహించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంతో పాటు కంటి వెలుగు, పోడు భూములు, జీ.ఓ నెం.లు 58 …

Read More »

ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు, పోడు పట్టాల పంపిణీ, జీవో నెంబర్‌ 58, 59, 118 తో పాటు, తెలంగాణకు హరితహారం లాంటి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్‌ నుండి కలెక్టర్లు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా స్థానిక …

Read More »

శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం

రెంజల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 17వ తేదీ శుక్రవారం రెంజల్‌ మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు రజిని కిషోర్‌ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందని సుపరిండెంట్‌ శ్రీనివాస్‌ తెలిపారు. సమావేశానికి వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఆయన అన్నారు.

Read More »

ఆదామ కంపెనీ ఆధ్వర్యంలో వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభం

రెంజల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని బోరువం గ్రామంలో ఆదామా పురుగుల మందు కంపెనీ వారి ఆధ్వర్యంలో రూ.5లక్షల 50 వేల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ ను గురువారం స్థానిక సర్పంచ్‌ వాని సాయి రెడ్డి ఆదామా కంపెనీ సౌత్‌ ఇండియా మేనేజర్‌ పాపునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదామా కంపెనీ పురుగుల మందు వ్యాపారంతో …

Read More »

సిఎం కెసిఆర్‌, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు పాలాభిషేకం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ పుణ్యం క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఇదివరకే విడుదల చేసిన 100 కోట్లతో పాటు మరో 500 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్‌ నిధుల మంజూరికి కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్ర పటానికి మల్లాపూర్‌ మండలం రేగుంట గ్రామంలో హనుమాన్‌ ఆలయం వద్ద హనుమాన్‌ భక్తులు అంజన్న దీక్షా పరులు పాలాభిషేకం …

Read More »

టియులో యోగా తరగతులు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యోగా శిక్షణ తరగతులను గురువారం సాయంత్రం 4:30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్‌ హాస్టల్‌లోని సమావేశ మందిరం లో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా వైస్‌ చాన్స్‌ లర్‌ మాట్లాడుతూ.. యోగ అభ్యాసం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. మానసిక ప్రశాంతతకు యోగ అభ్యాసం అందరు విద్యార్థులు …

Read More »

సెవెన్‌ హార్ట్స్‌ ఎన్జీవో ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం

కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్‌ మండలం యాచారం (4 గ్రామం పంచాయతీలు) గ్రామంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉత్తనూరు, శ్రీజ హాస్పిటల్‌ గాంధారి వారి సహకారంతో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెవెన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా …

Read More »

ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి…

బాన్సువాడ, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌లో జరిగే కార్యక్రమానికి బాన్సువాడ డివిజన్‌లోని ఆశ వర్కర్లతో కలిసి సిఐటియు నాయకులు ఖలీల్‌ తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశాలను కార్మికులుగా గుర్తించాలని కనీస వేతనం చెల్లించాలని కోరుతూ 16 రోజులు సమ్మె …

Read More »

ఆర్ట్స్‌ కాలేజీని సందర్శించిన విసి

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ కళాశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విభిన్న విభాగాలకు చెందిన తరగతి గదులు, సైన్స్‌ విభాగాలకు చెందిన ల్యాబ్స్‌ సందర్శించారు. విద్యార్థులు ల్యాబ్స్‌ సద్వినియోగం చేసుకోవాలని, తరగతులకు క్రమం తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. త్వరలో జరిగే సెమిస్టర్‌ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. సైన్స్‌ విద్యార్థులు ల్యాబ్‌లను ఉపయోగించుకొని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »