కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం సురాయిపల్లి గ్రామానికి చెందిన నూర్ సింగ్ అనీమియా వ్యాధితో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో బాధపడుతుండడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ …
Read More »ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
బాన్సువాడ, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం బాన్సువాడ మండలంలోని హన్మజిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు సిఐటియు నాయకులు ఖలీల్ ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశాలను కార్మికులను గుర్తించాలని కనీస వేతనం చెల్లించాలని కోరుతూ 16 …
Read More »ఆర్మూర్ ప్రాంత ప్రజలకు తెలియజేయునది…
ఆర్మూర్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఆర్మూర్ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చే డయాలసిస్ పూర్తి స్థాయి సేవలు ప్రారంభించబడ్డాయని, కావున కిడ్నీ సంబంధిత రోగులు డయాలసిస్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో కోరారు. అలాగే ఇంతకుముందు ఎవరైతే నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాలలో …
Read More »పనులు పూర్తయిన వెంటనే బిల్లుల చెల్లింపులు జరగాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులు వెంటదివెంట జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో గురువారం కలెక్టర్ మన ఊరు – మన బడి పనుల …
Read More »విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు అభినందనీయం..
కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కేంద్ర పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగానికి చేయూతనిచ్చే కేటాయింపులను చేయడం అభినందనీయమని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుతే ఈసారి విద్యా రంగానికి నిధుల కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయని దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలలో 38 వేల ఉపాధ్యాయుల నియామకం,740 …
Read More »తడి, పొడి చెత్త వేరుగా సేకరించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో ప్రతిరోజు తడి, పొడి చెత్తను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ద్వారా సేకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం స్వచ్ఛ భారత్ మిషన్, పంచాయతీరాజ్ చట్టం 2018 లేఅవుట్ రూల్స్, బిల్డింగ్ రెగ్యులేషన్స్ పై మండల స్థాయి అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై …
Read More »పోరాట యోధురాలు ఐలమ్మ
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుద పోరాట యోదురాలు చాకలి ఐలమ్మ స్త్రీ సమాజానికి ఆదర్శమని దర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ అన్నారు. బుధవారం డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం జిల్లా యువ నాయకులు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళికా సంఘ సభ్యులు, ధర్పల్లి జడ్పిటిసి జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి …
Read More »జిల్లాతో పెనవేసుకున్న అనుబంధం మరువలేనిది
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌లో మూడేళ్లకు పైగా విధులు నిర్వహించిన సందర్భంగా జిల్లాతో పెనవేసుకున్న అనుబంధం ఎన్నటికీ మర్చిపోలేనిది కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డికి నిజామాబాద్ లో పాలనాధికారిగా విధులు నిర్వహించి, వికారాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, …
Read More »బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.40 గంటల సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న నూతన జిల్లా పాలనాధికారికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, బి.చంద్రశేఖర్, జిల్లా అటవీ …
Read More »కిలిమంజోరా అధిరోహించిన వెన్నెలకు కలెక్టర్ అభినందన
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కిలిమంజోరా పర్వతాన్ని అధిరోహించిన బానోతు వెన్నెలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున కిలి మంజరో పర్వతాన్ని ఆమె అధిరోహించిందని తెలిపారు. భవిష్యత్తులో మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తానని పర్వత అధిరోహిని బానోతు వెన్నెల పేర్కొన్నారు.
Read More »