NizamabadNews

నాటుసారా తయారుచేసినా, విక్రయించినా కఠిన చర్యలు

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్తీకల్లు, నాటు సారా తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ అధికారి ఎస్‌ రవీందర్‌ రాజు తెలిపారు. 2022 జూలై 1 నుంచి కామారెడ్డి జిల్లాలోని ఐదు ఎక్సైజ్‌ స్టేషన్లో పరిధిలో నమోదైన కేసుల వివరాలను సోమవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కల్లు 167 షాంపిళ్లను సేకరించి రసాయనశాలకు పంపించి కేసులు …

Read More »

కంటి వెలుగు అద్భుత కార్యక్రమం

వేల్పూర్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అక్లూర్‌ గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సోమవారం సందర్శించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన,కంటి పరీక్షలు జరుగుతున్న తీరు, ఎంత మందికి పరీక్షలు చేశారు.ఎంత మందికి అద్దాలు ఇచ్చారు. ఎంత మందికి ఆపరేషన్‌ అవసరం ఉంది …

Read More »

ప్రయివేటు వాహనాలు నిలుపకుండా తనిఖీలు చేపట్టాలి

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బస్టాండ్‌ సమీపంలో ప్రైవేటు వాహనాలు నిలుపకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం ఆర్టీసీ, ఆర్టీవో, పోలీస్‌ అధికారులతో ఆర్టీసీ ఆదాయం పెంపుపై సమీక్ష నిర్వహించారు. ప్రతి సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 …

Read More »

బార్‌ అసోయేషన్‌ ఆధ్వర్యంలో పరాక్రమ దివస్‌

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పరాక్రమ దివస్‌గా పాటిస్తూ జిల్లా కోర్టు ఆవరణంలోని అసోసియేషన్‌ హాల్లో సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్రం గణపతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని నేటి యువత ఆయన స్ఫూర్తితో ముందుకు …

Read More »

ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

రెంజల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 126 వ జయంతి ని మండలంలోని సాటాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తెలుగు మీడియం పాఠశాలలో జనాభాయ్‌ రవికుమార్‌ దంపతులు తన కుమారుడు సాయి విశ్వాస్‌ ఇదే రోజు జన్మించడం అదృష్టమని ఈ సందర్భంగా 150 మంది విద్యార్థినీ విద్యార్థులకు, భవిత పాఠశాలలో చదువుతున్న దివ్యాంగుల పిల్లలకు నోట్‌ బుక్స్‌, పలకలను ప్రధానోపాధ్యాయులు …

Read More »

విద్యార్థుల్లో నైపుణ్యాలను గుర్తించడానికి పరీక్ష పే చర్చ

రెంజల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బోధన్‌ నియోజకవర్గ భాజపా సినియర్‌ నాయకులు వడ్డీ మోహన్‌ రెడ్డి, మేడపాటి ప్రకాష్‌ రెడ్డిలు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థుల్లో …

Read More »

క్రీడా పోటీలు ప్రారంభం

రెంజల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలకేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల లోని విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని క్రీడా పోటీలను స్థానిక సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ ఎస్‌ఎంసి చైర్మన్‌ ఎం నాగరాజు ఆధ్వర్యంలో ప్రారంభించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని వారు అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ బలరాం, నాయకులు రఫిక్‌, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్‌, ఉపాధ్యాయులు చిన్నప్ప, సంతోష్‌, …

Read More »

పేదల పెన్నిధి సీఎం కేసీఆర్‌

రెంజల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజల పెన్నిధి ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన జబ్బర్‌ ఖాన్‌కు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన రూ.36 వేలు, బి. సత్తెవ్వకు రూ.14 వేలు, మహ్మద్‌ ఉస్మాన్‌ కు రూ.11 వేల చెక్కును అందజేశారు. అనారోగ్యానికి గురైన …

Read More »

ఉత్తమ అధికారుల వివరాలు అందజేయాలి

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :ఉత్తమ అధికారులను ఎంపిక చేసి శాఖల వారీగా వారి పేర్లను పర్యవేక్షకుడు సాయి భుజంగరావుకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజా ప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందే విధంగా అధికారులు చూడాలని …

Read More »

ప్రజావాణికి 79 ఫిర్యాదులు

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 79 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు డీఆర్డీఓ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »