ఎల్లారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం స్థానిక ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఏర్పాటుచేసిన సమావేశంలో నాగిరెడ్డిపేట మండలం, ఎల్లారెడ్డి మండలం సంబంధించిన సభ్యత్వ నమోదు చేసిన బూత్ ఎన్రోలర్స్‌కు, ఆ గ్రామానికీ సంబందించిన ముఖ్య నాయకులకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »సోనియా శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ క్యాంప్
కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ, ప్రభుత్వ పాఠశాలలో సోనియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ భలేరావు ట్రస్ట్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ 45 రోజుల ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచిత టైలరింగ్ క్యాంప్ శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థినీలకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్‌లు పంపిణీ చేశామన్నారు. ముఖ్య అతిథులు, ట్రస్టీ సభ్యులు …
Read More »ప్రజల విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని …
Read More »వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య
కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన …
Read More »అధికారికంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో దొడ్డి కొమురయ్య జయంతి నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు …
Read More »బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్వాయి పాపన్న
కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని జై గౌడ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాంగోళ్ల మురళి గౌడ్ అన్నారు. తాడ్వాయి మండలంలోని ఎర్ర పహాడ్ గ్రామంలో సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 313 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మొదటగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. …
Read More »విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ గ్లోరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలను కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. విద్యార్థులు తల్లితండ్రులకు బహుమతులు అందజేశారు. శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ స్వర్ణలత మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో కుటుంబం తల్లిదండ్రుల విలువలు మానవ సంబంధాలు ప్రాధాన్యతను తెలియజేయడమే ఈ ఫ్యామిలీ గ్లోరి కార్యక్రమం …
Read More »కలెక్టర్ చేతుల మీదుగా పులిహోర పంపిణీ
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయా సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చే వారి కోసం సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో పులిహోర వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా పులిహోర పంపిణీ చేశారు. వేసవి ఎండలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో, ప్రజావాణి కార్యక్రమానికి ప్రతి సోమవారం సుదూర …
Read More »ప్రజావాణికి 78 ఫిర్యాదులు
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 78 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ చందర్, నిజామాబాదు …
Read More »నిబంధనల అమలుపై నిశిత పరిశీలన
నిజామాబాద్, ఏప్రిల్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని రవి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే …
Read More »