NizamabadNews

పది పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అడ్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో కల్పించిన మౌలిక వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.

Read More »

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

రెంజల్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి గ్రామ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా జల్ద శ్రీనివాస్‌,లోల గంగాధర్‌,ఉపాధ్యక్షుడిగా దేవిదాస్‌, సహాయకార్యదర్శిగా స్వామి,కోశాధికారిగా మోహన్‌ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలీల ఐక్యతకు కృషి చేస్తామని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వపరంగా పద్మశాలీల …

Read More »

విద్యార్థులకు పండ్లు పంపిణీ

రెంజల్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో ఆదివారం విద్యార్థులకు రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు జన్మదినాన్ని పురస్కరించుకొని పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. గ్రామ బిఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుండి బిఆర్‌ఎస్‌ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ పార్టీ బలోపేతానికి …

Read More »

సర్వాయి పాపన్నగౌడ్‌ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌ వర్ధంతిని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, శాసన మండలి సభ్యుడు …

Read More »

మెడికల్‌ కళాశాలను సందర్శించిన జెడ్పి చైర్మన్‌, కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను శనివారం సాయంత్రం జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సందర్శించారు. మెడికల్‌ కళాశాలలో అందుబాటులో ఉన్న వసతి, సదుపాయాలను పరిశీలించారు. కళాశాల నిర్వహణ తీరు గురించి ప్రిన్సిపాల్‌ ఇందిరను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్న …

Read More »

రూర్బన్‌ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూర్బన్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జుక్కల్‌ మండలంలోని సవర్గావ్‌, పాడంపల్లి, మొమ్మదాబాద్‌, జుక్కల్‌ గ్రామాల్లో పలు ప్రగతి పనులను పరిశీలించారు. గ్రామపంచాయతీ భవనం, ఆక్సిజన్‌ పార్క్‌, బస్సు షెల్టర్‌, కూరగాయల పందిళ్లను, ఆడిటోరియం, మినీ స్టేడియం పనులను చూశారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. …

Read More »

ప్రేమికుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య

మాక్లూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లుర్‌ మండలం మాణిక్‌ బండర్‌ తండాకు చెందిన రాజేశ్వరి (19) మార్చ్‌ 23 రాత్రి గడ్డి మందు సేవించడంతో గమనించిన తండ్రి భీమ్‌ నాయక్‌ నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యం అందించారు. 28 తేదీ వరకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. …

Read More »

పోషణ పక్షం కార్యకమ్రాన్ని ప్రారంభించిన జడ్పి ఛైర్మన్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో జిల్లా మహిళా, శిశు వికలాంగుల మరియు సీనియర్‌ సిటిజెన్‌ శాఖ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పోషణ -పక్షం కార్యక్రమాన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రాయ్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ నెల మూడవ తేదీ వరకు కొనసాగనున్న పోషణ్‌ పక్వాడలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం …

Read More »

ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు నెలాఖరు వరకు గడువు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీఓ నెం.58, 59 ద్వారా అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు ఏప్రిల్‌ ఒకటి నుంచి ఏప్రిల్‌ 30 వ తేదీ వరకు మీ సేవా ద్వారా దరఖాస్తులను సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58, 59 ప్రకారం అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల …

Read More »

బ్యాంకింగ్‌ సేవలు విస్తరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకింగ్‌ సేవలను ఖాతాదారులకు విస్తరించాలని ఎస్‌బిఐ ఏటీఎం విజయ్‌ కుమార్‌ అన్నారు. శనివారం కామారెడ్డిలోని ఎస్బిఐ మెయిన్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ టి శ్రీనివాస్‌ వీడ్కోలు సమావేశానికి హాజరై మాట్లాడారు. బ్యాంకింగ్‌లో 39 సంవత్సరాలుగా సేవలు చేసి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం అని కొనియాడారు. అనంతరం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరీ శంకర్‌ మాట్లాడుతూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »