రెంజల్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కందకుర్తి ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం) లో అనాధ, పేద విద్యార్థులకు పరీక్ష అట్టలు, నోటుబుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, కంపాక్స్ బాక్సులను స్థానిక సర్పంచ్ ఖలీంబేగ్ చేతుల మీదుగా శనివారం పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ ముఖీంబేగ్ తన సొంత ఖర్చులతో పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చారు. ఆరో తరగతి నుండి పదవ …
Read More »రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామికం
రెంజల్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై స్పందించడంతో పెరుగుతున్న ప్రజా ఆదరణను చూసి బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, జిల్లా ఉపాధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాహుల్ గాంధీ …
Read More »గొర్రెల పంపిణీ పథకం అమలులో క్రియాశీలక పాత్ర పోషించాలి
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గొర్రెల పంపిణీ పథకం అమలులో కలెక్టర్‌లు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న సందర్భంగా మంత్రి గొర్రెల పంపిణీ పథకం పై పలు సూచనలు చేశారు. ఇప్పటికే …
Read More »సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రారంభమైన వార్షిక ఉత్సవం
ఆర్మూర్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ పరిధిలోని కోటార్మూరులో గల విశాఖ కాలనీలోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో శనివారం అష్టమ వార్షికోత్సవ కార్యక్రమం శ్రీశ్రీశ్రీ బ్రహ్మశ్రీ బల్యపల్లి సుబ్బరావు గురుస్వామి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఉదయము శాంతి మంత్ర పరసము, గౌరి గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము నవగ్రహ, మాత్మక యోగిని వాస్తు క్షేత్రపాలకు, సర్వతోభద్ర మండలాధి ఆరాధన, హవనములు స్వామి వారికి …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్, టిఎస్‌ఆర్టిసి చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులు మొత్తం 42 మందికి చెక్కుల విలువ రూ . 13 లక్షల 71 వేలు లబ్ధిదారులకు …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్
భీంగల్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన కర్రోల్ల సుమన్ ఇటీవల తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు. సుమన్ 5 సంవత్సరాల క్రితం గల్ఫ్ వెళ్ళి పని దొరకక నష్టపోయి తిరిగి వచ్చి ఉన్న కొన్ని గొర్రెలను మేపుకొని జీవితం గడిపి కుటుంబాన్ని పోషించాడు. అప్పులు ఎక్కువ కావడంతో గొర్రెలను అమ్మేసి ఊరిలోనే వేరొకరి దగ్గర గొర్ల కాపరిగా …
Read More »పరీక్షలు వాయిదా
డిచ్‌పల్లి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ బీఈడీ కళాశాలలకు చెందిన మొదటి సెమిస్టర్ థియరీ పరీక్షలు ఈనెల మూడవ తేదీ నుంచి ప్రారంభం కావలసి ఉండగా అనివార్య కారణాలతో పరీక్షలు వాయిదా వేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ ఎం.అరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున అర్హులైన బీఈడీ మొదటి సెమిస్టర్ విద్యార్థులు ఈ విషయం గమనించాలని …
Read More »వసతి గృహాన్ని తనిఖీ చేసిన వైస్ చాన్స్‌లర్
డిచ్‌పల్లి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్‌ని శనివారం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బాయ్స్ హాస్టల్‌లోని వంటశాల, స్టోర్ రూమ్, విద్యార్థుల గదులను పరిశీలిస్తూ కలియతిరిగారు. వంటశాలలో అపరిశుభ్రత ఉండటంపై వైస్ ఛాన్స్‌లర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డైనింగ్ హాల్‌లో మధ్యాహ్నం విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. అక్కడే …
Read More »ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మారిన ప్రస్తుత సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా జడ్జి సునీత కుంచాల హితవు పలికారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు శనివారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా …
Read More »ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు
హైదరాబాద్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఎంసెట్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడిరచింది. ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా. ఎన్. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడిరచారు. మే …
Read More »