NizamabadNews

జనవరి 11 వరకు రైతులు అభ్యంతరాలు తెలపవచ్చు

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 11 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రైతులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ బి పాటిల్‌ విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలోని ప్రధాన కూడలిలో వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మాస్టర్‌ ప్లాన్‌ వివరాలను …

Read More »

విపత్తుల సమయంలో ఎన్‌.డీ.ఆర్‌.ఎఫ్‌ పాత్ర క్రియాశీలకం

నిజామాబాద్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనుకోని రీతిలో విపత్తులు సంభవించిన సమయాల్లో ఎన్‌. డీ.ఆర్‌.ఎఫ్‌ (నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) నిర్వర్తించే పాత్ర ఎంతో క్రియాశీలకమైనదని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ ప్రశంసించారు. విపత్తులు సంభవించినప్పుడు ఎన్‌. డీ.ఆర్‌.ఎఫ్‌ ఎలా స్పందిస్తుంది.. ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనే అంశాలపై అవగాహన కల్పించేందుకు శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని క్రీడా అథారిటీ మైదానంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. …

Read More »

కంటి వెలుగు విజయవంతం చేయాలి

ఆర్మూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 18 నుండి ప్రారంభమయ్యే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ఆయన దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కంటి వెలుగుపై ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు ఆరోగ్య పర్యవేక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల …

Read More »

సరిపడా మందులు అందుబాటులో ఉంచాలి

డిచ్‌పల్లి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :తెలంగాణ విశ్వ విద్యాలయంలోని హెల్త్‌ సెంటర్‌ను వైస్‌ చాన్స్‌లర్‌ రవిందర్‌ గుప్త తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సరిపడా మందులు అందుబాటులో ఉంచాలని, డాక్టర్‌ అనూషకి వీసి సూచించారు. విద్యార్థి ని విద్యార్థులకు, వర్సిటీ సిబ్బందికి సరైన వైద్య సేవలు అందించి, త్వరగా కోలుకునేలా చికిత్స అందించాలని, ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Read More »

సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని 39 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 20 లక్షల 22 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 1,741 మందికి 10 కోట్ల 72 లక్షల 85 వేల 300 రూపాయల …

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మమత (23) గర్భిణీ మహిళ రక్తహీనతతో బాధపడుతున్నడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. జిల్లా కేంద్రానికి చెందిన నరేష్‌ సహకారంతో ఓ పాజిటివ్‌ రక్తాన్ని వీ.టి.ఠాకూర్‌ …

Read More »

ట్రాక్టర్‌ బోల్తా – వ్యక్తి మృతి

బాన్సువాడ, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన పిట్ల మోహన్‌ (30) వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్‌ ట్రాలీ నడుపుకుంటూ నారును తీసుకువస్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్‌ అదుపుతప్పి పొలంలో పడడంతో మోహన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు శవ పంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం …

Read More »

గోదావరిలో దూకి ఇరిగేషన్‌ డి.ఈ.ఈ ఆత్మహత్య

నవీపేట్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యంచ గోదావరి నదిలో దూకి ఇరిగేషన్‌ డి.ఈ.ఈ ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌. ఐ. రాజిరెడ్డి తెలిపారు. ఎస్‌.ఐ, స్థానికుల సమాచారం ప్రకారం మండలంలోని పోతంగల్‌ గ్రామానికీ చెందిన రమణ రావు (46) ఆర్మూర్‌ ఇరిగేషన్‌ డి.ఈ.ఈ. గా విధులు నిర్వహిస్తున్నారు. గత యేడాది ఫిబ్రవరి15 నుండి వ్యక్తిగత కారణాలతో సెలవు పెట్టుకొని హైదరాబాద్‌ లో కుటుంబ సభ్యులతో కలిసి …

Read More »

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

నిజామాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మొదటి అదనపు జిల్లా జడ్జి కోర్టు ఆర్డర్‌ ఇంప్లిమెంటేషన్‌ కోసం నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంకి వెళ్లిన న్యాయవాది గణపతిని కోర్టు సిబ్బందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం నిరసిస్తూ నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం అత్యవసర సమావేశమై పోలీసులు అక్రమ కేసులను నమోదు చేయదాన్ని తీవ్రంగా ఖండిరచింది. ఈ సంఘటనను నిరసిస్తూ న్యాయవాదులు నిరవధికంగా …

Read More »

పరీక్ష తేదీలు మార్పు

డిచ్‌పల్లి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్రాంతి సెలవుల దృష్ట్యా 13.1.2023 జరగాల్సిన మోడ్రన్‌ లాంగ్వేజెస్‌ తెలుగు, ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌ల పరీక్షను 21.1.2023 కు మరియు 16.1.2023 జరగాల్సిన పరీక్షను 23.1.2023 కు మార్చామని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »