NizamabadNews

ఎన్జీవో (స్వచంద సేవా సంస్థ) ప్రారంభం

కామారెడ్డి, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వచంద సేవా సంస్థలు అయిన సేవన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ మరియు ఫోర్‌ సైట్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్జీవో) లను శ్రీ ఆర్యభట్ట గ్రూప్‌ ఆఫ్‌ కాలేజెస్‌ చైర్మన్‌ కే. గురువెందర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవ చేయాలనే దృక్పథంతో ఒక సంకల్పాన్ని నిర్ణయించుకుని ఎన్జీవోగా కార్యరూపం దాల్చిన సెవెన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ మరియు …

Read More »

పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశం

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులోని చిన్నాపూర్‌ వద్ద గల అర్బన్‌ పార్క్‌ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. తుది దశకు చేరిన వివిధ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఓపెన్‌ జిమ్‌లు, ప్లే జోన్‌ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్‌ ట్యాంకులు, వాచ్‌ టవర్‌, రోడ్డు నిర్మాణాలను కలెక్టర్‌ పరిశీలించి ఫారెస్ట్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. చిల్డ్రన్స్‌ పార్క్‌ పనులను …

Read More »

మత్తు పదార్థాలు కలిపితే చర్యలు

కామరెడ్డి, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో ఇప్పటి వరకు 52 గుడుంబా కేసులు,75 కల్లు శాంపిలను, 3484 కిలోల అక్రమ బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి ఎక్సైజ్‌ సీఐ. ఎన్‌. విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్‌ 26 వరకు నమోదు అయిన కేసులు వివరాలు ఆయన వెల్లడిరచారు. కామారెడ్డి ఎక్సైజ్‌ స్టేషన్‌ …

Read More »

6వ ఎలైట్‌ ఉమెన్స్‌ నేషనల్‌ టైటిల్‌లో ఛాంపియన్‌గా నిఖత్‌ జరీన్‌

నిజామాబాద్‌, డిసెంబరు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ చేజిక్కించుకున్న నిజామాబాద్‌ బిడ్డ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ తాజాగా మధ్యప్రదేశ్‌ బోపాల్‌లో జరిగిన 6వ జాతీయ ఎలైట్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ నెగ్గడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన తుదిపోరులో రైల్వేస్‌ (ఆర్‌ఎస్‌పిబి) బాక్సర్‌ …

Read More »

యూత్‌ పార్లమెంట్లో మౌనిక అద్భుత ప్రసంగం

కామారెడ్డి, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుడ్‌ గవర్నెన్స్‌ డే ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా జరిగిన కాంపిటీషన్స్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఆర్కే కళాశాల విద్యార్థిని కే .మౌనిక ఆదివారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన యూత్‌ పార్లమెంట్లో ప్రసంగించింది. వివిధ దశలలో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి మరియు దేశస్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొంది నేడు అటల్‌ బిహారీ వాజ్పేయి గురించి మాట్లాడే …

Read More »

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లి శ్రీకాంత్‌

నవీపేట్‌, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లి శ్రీకాంత్‌ను నియమిస్తు జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీకాంత్‌కు నియమాక పత్రం అందచేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీకాంత్‌ విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో క్రియాశీలకంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో పని చేశారని, ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌లో కార్యకర్తగా పని …

Read More »

కరుణన్న యువసేన ఆద్వర్యంలో పండ్లు, కేకుల పంపిణీ

ఎడపల్లి, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కెప్టెన్‌ కరుణాకర్‌ రెడ్డి వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని బోధన్‌ నియోజకవర్గంలోని బోధన్‌ పట్టణం, ఎడపల్లి, నవీపేట్‌, రెంజల్‌, సాలూర మండల కేంద్రంలతో పాటు పలు గ్రామాలలో కరుణన్న యువసేన ఆద్వర్యంలో కేకులు కట్‌ చేసి పలు ఆరోగ్య కేంద్రాల వద్ద పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి ఆయా గ్రామాల్లో యువకులకు హెల్మెట్లు, దోమతెరల పంపిణీని …

Read More »

ఎడపల్లి మండలంలో క్రిస్మస్‌ వేడుకలు

ఎడపల్లి, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండల కేంద్రంతో పాటు ఏఆర్పి క్యాంప్‌, జానకంపేట్‌, పోచారం, ఎమ్మెస్సీ ఫారం, వడ్డేపల్లి, అంబం గ్రామాలలో క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని బేతానియా ఫెలోషిప్‌ చర్చితో పాటు ఆయా గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలను ప్రత్యేకంగా అలంకరించారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రిస్మస్‌ వేడుకలను ఆదివారం …

Read More »

ముగిసిన వాజ్‌ పాయ్‌ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌

ఎడపల్లి, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్‌ గ్రామంలో మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌ పాయ్‌ స్మారకార్థం ఆదివారం జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగింపును నిర్వహించారు. బోధన్‌ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్‌, వడ్డేపల్లి సర్పంచ్‌ కూరెళ్ళ శ్రీధర్‌ ఆద్వర్యంలో ఈ నెల15 న ప్రారంభించిన పోటీల్లో 20 టీంలు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. …

Read More »

వినియోగదారులు హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారులు తమ హక్కుల గురించి అవగాహనను పెంపొందించుకోవాలని జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ చైర్‌ పర్సన్‌ సువర్ణ జయశ్రీ సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై వినియోగదారుల హక్కులు, చట్టాల గురించి అవగాహన కల్పించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »