NizamabadNews

మధ్యాహ్నం భోజనం వికటించి 14మంది విద్యార్థులకు అస్వస్థత

రెంజల్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్నం భోజనంలో ముద్ధ వంకాయకూర వడ్డించారు. సాయంత్రం సమయంలో విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి రావడంతో కొంతమంది విద్యార్థులను ప్రిన్సిపల్‌ బలరాం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. …

Read More »

ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే కృత నిశ్చయంతో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నేటితో (గురువారం) ముగియనుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువు ముగిసే లోపు ఓటరు జాబితాలో తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. …

Read More »

ఉచిత ఎన్‌సిడి మందుల కిట్లు పంపిణీ

రెంజల్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఎన్సిడి మందుల కిట్లను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ సాయరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని దూపల్లి గ్రామంలో ఉచిత ఎన్సిడి మందుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటిక్‌, బిపి, షుగర్‌, రక్తపోటు గల పేషెంట్లకు ప్రతినెల ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఉచితంగా …

Read More »

పాఠశాలను సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్‌ఓ

రెంజల్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలతో పాటు బీసీ బాలికల వసతి గృహాన్ని బుధవారం డిప్యూటీ డిఎంహెచ్‌వో విద్య సందర్శించారు. మంగళవారం పాఠశాల చెందిన ఐదుగురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే సమాచారం మేరకు బాలికల వసతిగృహంతో పాటు జిల్లా పరిషత్‌ పాఠశాలలో నిత్యవసర వస్తువులను తనిఖీ నిర్వహించి పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ తీరును పరిశీలించారు. అనంతరం …

Read More »

రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసిపి

రెంజల్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వార్షిక తనిఖీలోనిగా భాగంగా బుధవారం రెంజల్‌ పోలీస్‌ స్టేషన్‌ ను బోధన్‌ ఏసీపీ కిరణ్‌ కుమార్‌ తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న పలు రకాల రికార్డులతో సిబ్బంది పనితీరును పరిశీలించడం జరిగిందని అన్నారు. పెండిరగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని …

Read More »

గల్ఫ్‌ సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలి

నిజామాబాద్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన గల్ఫ్‌ కార్మికుల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని తెలంగాణ ఎంపీలకు గల్ఫ్‌ వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు. భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేసి యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌ దేశాలను ఒప్పించి హైదరాబాద్‌లో కాన్సులేట్‌ (రాయబార దౌత్య కార్యాలయాలు) ఏర్పాటు చేయించాలని, హైదరాబాద్‌లో యూఏఈ కాన్సులేట్‌ …

Read More »

దేశ రక్షణంలో త్రివిధ దళాల సేవలు మరువలేనివి

నిజామాబాద్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆదేశానుసారము ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి డి.రమేష్‌ నిజామాబాద్‌ జిల్లా నూతన కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో సాయుధ దళాల పతాక దినోత్సవమును జండా ఊపి ప్రారంభించినారు. దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారత దేశ రక్షణ కొరకు, …

Read More »

ప్రణాళికాబద్దంగా కంటి వెలుగు

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు తెలిపారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్‌ నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, వైద్య శాఖ కమిషనర్‌ శ్వేత, హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, హైదరాబాద్‌ నుంచి వైద్య శాఖ కార్యదర్శి సయ్యద్‌ …

Read More »

అన్ని విషయాలలో అంబేడ్కర్‌ నిపుణుడు

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం అంబేద్కర్‌ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. అన్ని సబ్జెక్టులలో అంబేద్కర్‌ నిపుణుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ …

Read More »

తెరాస ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్దంతి

నందిపేట్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసిన ‘భారతరత్న అంబేద్కర్‌’ అని నందిపేట్‌ మండల టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్‌ పేర్కొన్నారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిదని, అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా నందిపేట్‌ మండల టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »