నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ దేశాలలోనే ఎంతో గొప్పదైన భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరు కట్టుబడి పని చేయాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శనివారం ఆయా శాఖల అధికారులు, సిబ్బందిచే భారత సంవిధానానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, భారత …
Read More »హైకోర్టు న్యాయమూర్తిని సన్మానించిన ఇందూర్ న్యాయవాదులు…
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేషనల్ లా డే సందర్భంగా న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాదు కేశవ నిలయంలో జరిగిన సదస్సులో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి భీమపాక నగేష్‌ను ఇందూరు న్యాయవాదులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగన్మోహన్ గౌడ్, రాజ్ కుమార్ సుబేదార్, న్యాయవాదులు వసంతరావు, బిట్ల రవి, సుజన్ రెడ్డి …
Read More »అందరికి సముచిత న్యాయం… వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరంగల్‌లో రాహుల్ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం కామారెడ్డిలోని నరసన్నపల్లి, పాతరాజంపేట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, కాంగ్రెస్ కార్యకర్తలకు సభ్యత్వ నమోదు ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత …
Read More »ఈద్గా నిర్మాణ పనులు ప్రారంభం
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి శివారులో గల ఈద్గా పనులను 35, 12వ వార్డ్ కౌన్సిలర్లు ప్రారంభించారు. ఈద్గా నిర్మాణానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కు వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి శివారులో ఈద్గా నిర్మాణ పనులను 12, 35 వార్డ్ కౌన్సిలర్‌లు …
Read More »18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు శనివారం, రేపు ఆదివారం తిరిగి డిసెంబర్ 3,4 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ -2023 లో భాగంగా ఈ 26, 27, డిసెంబర్ 3, 4 తేదీలలో నిర్వహించే ప్రత్యేక క్యాంపేయిన్‌లో 18 …
Read More »పంట రుణాల పంపిణీలో ఉదాసీనత వీడాలి
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకీ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రైతాంగానికి నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం జరిగింది. గత ఖరీఫ్, …
Read More »లక్ష్యాలు చేరడానికి బ్యాంకర్లు కృషి చేయాలి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దేశించిన లక్ష్యాలను చేరడానికి బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం 2022-23 సెప్టెంబర్ అర్ధ సంవత్సర బ్యాంకుల రుణ వితరణ, పనితీరు పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2022-23 లో నిర్దేశించుకున్న వార్షిక సంవత్సరంలో రూ.4700 …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చాలి
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా గట్టిగా కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం ఉదయం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఓటరు నమోదుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీలలో ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో, 18 …
Read More »26న మెగా ఉద్యోగ మేళా
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వారు నిర్వహిస్తున్న టెక్ బీ ప్రోగ్రాం కొరకు ఎంపిసి / ఎంఇసి 60శాతం మాథ్స్ సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత పొందిన ఇంటర్మీడియట్ 2021 Ê 22 లో పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈనెల 26 శనివారం ఉదయం 10 గంటలకు నిజామాబాద్‌లోని కేర్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్, …
Read More »ఆదివారం మూడు పుస్తకాల ఆవిష్కరణ
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు 5 వ అంతస్తు, హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్, నిజామాబాద్‌లో తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖ, అసోసియేట్ ప్రొఫెసర్, డా. వంగరి త్రివేణి రచించిన మూడు వ్యాససంపుటాలు ‘‘అరుగు’’, ‘‘బటువు’’, ‘‘భరిణ’’ పుస్తకాల అంకితోత్సవం – పరిచయ సభ నిర్వహింపబడుతుందని తెలిపారు. కవులు, రచయితలు, సాహిత్య అభిమానులు విచ్చేసి కార్యక్రమాన్ని …
Read More »