NizamabadNews

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండల కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్‌ శాసనసభ్యులు హనుమంతు షిండే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం పత్తి క్వింటాలుకు రూ. 9609 పైచిలుకు ఉందని తెలిపారు. రైతులు కష్టపడి పండిరచిన పంటను దళారుల వలలో పడకుండా నేరుగా మార్కెట్లో వచ్చి అమ్ముకోవాలని రైతులు లాభాల బాట పట్టాలని ఎమ్మెల్యే …

Read More »

మనఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

రెంజల్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనఊరు మన ఎమ్మెల్యే రెండవ దఫా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని బొర్గం, తాడ్‌ బిలోలి, మౌలాలి తాండా గ్రామాలలో చేపడుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్‌ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్‌ పాషా, బీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు హజీ ఖాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని పల్లెపల్లెకు వివరించేందుకు మన ఊరు మన …

Read More »

జిల్లా అధికారులకు ముఖ్య గమనిక

నిజామాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ గారి ఆదేశాల మేరకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను అంశాలపై ఆ శాఖ అధికారులచే ఈ నెల 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో వర్క్‌ షాప్‌ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ట్రెజరీ కార్యాలయం ఉప సంచాలకులు బి.కోటేశ్వరరావు ఒక …

Read More »

కాల భైరవస్వామిని దర్శించుకున్న ఎంపి, ఎమ్మెల్యే

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామరెడ్డి ఈసన్నపల్లి గ్రామాల్లోని కాల బైరవ స్వామి జన్మదిన వేడుకల్లో గురువారం ఎంపీ బిబిపాటిల్‌, ఎమ్మెల్యే సురేందర్‌ పాల్గొన్నారు. స్వామి వారి సన్నిధిలో అగ్గి గుండాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గొల్లపల్లి గ్రామ సర్పంచ్‌ లావణ్య మల్లేశ్‌ ఇంటికి చేరుకుని గ్రామ సర్పంచ్‌కి, వారి పాలక వర్గానికి …

Read More »

గురుకులాల పనివేళల మార్పుపై సానుకూలంగా స్పందించిన మంత్రి

హైదరాబాద్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ బిసి సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పనివేళలను ఇతర సంక్షేమ గురుకుల విద్యాసంస్థలతో సమానంగా ఉదయం 9 నుండి సాయంత్రం 4.30 వరకు మార్చటానికి బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అంగీకరించారని టిఎస్‌ యుటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి …

Read More »

వేలం ద్వారా రూ.1.14 కోట్ల ఆదాయం

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 9 ప్లాట్లు, ఒక గృహం వేలం పాట ద్వారా విక్రయించగా రూ.1.14 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు. గురువారం కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో ధరణి టౌన్షిప్‌ లోని ప్లాట్లకు వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 20 ఫ్లాట్లు, 45 గృహాలకు వేలంపాట నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో …

Read More »

సమస్యల పరిష్కారానికి అధికారులు శ్రద్ద చూపాలి

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమావేశంలో చర్చించిన అంశాలు, వాటిని పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాను అన్ని …

Read More »

నందిపేట్‌ మండలానికి ఫైర్‌స్టేషన్‌ మంజూరు

నందిపేట్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ మండలానికి ప్రభుత్వం కొత్తగా ఫైర్‌స్టేషన్‌ మంజూరు చేసింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కొత్తగా 15 నూతన ఫైర్‌ స్టేషన్‌లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. కాగా నందిపేట్‌ మండల కేంద్రంలో ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి పలుసార్లు ప్రభుత్వానికి …

Read More »

తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత సమాజానిదే

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 21వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆలయ సేవకులు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రతి 20 రోజులకు …

Read More »

నవీపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

నవీపేట్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండల కేంద్రంలోని చెక్‌ పోస్ట్‌ సమీపంలో నిజామాబాద్‌ నుండి వస్తున్న లారీ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరితో పాటు ఇద్దరు వీఆర్‌ఏలకు తీవ్ర సైతం గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని సుభాష్‌ నగర్‌లో నివాసముంటున్న ఉదయ్‌ (14), సాయి తేజ (14) లు 9వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు కలిసి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »