NizamabadNews

వీరనారి చాకలి ఐలమ్మ స్పూర్తితో ముందుకు సాగాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకుని సోమవారం వినాయక్‌ నగర్‌లో ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్‌, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల …

Read More »

శిథిలావస్థలో వాటర్‌ ట్యాంక్‌…

కామారెడ్డి, సెప్టెంబర్ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశినగర్‌ మండలం భూంపల్లి గ్రామంలో చాలా కాలం కిత్రం నిర్మించిన వాటర్‌ ట్యాంక్‌ శిథిలావస్థకు వచ్చిందని గ్రామస్తులు తెలపడంతో మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు, ఉపసర్పంచ్‌ పసుల సాయిలు, వార్డ్‌ మెంబర్‌ రమేష్‌, యాదవ సంఘం పెద్దలు మైపాల్‌, రమేష్‌, తిపిరిశెట్టి రమేష్‌, మరికొంతమంది ప్రజలు వాటర్‌ ట్యాంక్‌ శిథిలావస్థ గురించి మాజీ జెడ్పిటిసికి సూచించారు. ఆదివారం ట్యాంకు పరిశీలించిన …

Read More »

హై కోర్టు చీఫ్‌ జస్టిస్‌కు స్వాగతం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్వల్‌ బుయాన్‌, హైకోర్టు జడ్జి పి. నవీన్‌ రావ్‌ కు ఆదివారం కామారెడ్డి ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌ వద్ద జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్వల్‌ బుయాన్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్‌ నుంచి నిజాంబాద్‌ వెళ్తుండగా మార్గమధ్యంలో ఆర్‌అండ్‌బి …

Read More »

క్లినిక్‌ను వినియోగించుకోవాలి…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నాందేవ్‌వాడలో ప్రారంభించిన మల్లు స్వరాజ్యం క్లినిక్‌ కరపత్రాలను ఆదివారం జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్‌ రామ్‌ మోహన్‌ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో శాస్త్రీయ వైద్యాన్ని అందించేందుకు డాక్టర్‌ రవీంద్రనాథ్‌ సూరి ఆధ్వర్యంలో …

Read More »

ఏకాత్మత మానవతావాదాన్ని ప్రవచించిన రుషితుల్యులు దీన్‌ దయాళ్‌జీ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైన భారతీయ జనసంఫ్‌ు వ్యవస్థాపకులలో ఒకరైన పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ 106 వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ, మండల అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌, రోహిత్‌ రెడ్డి ఆధ్వర్యంలో చేపుర్‌ క్షత్రియ ఇంజనీరింగ్‌ కళాశాలలో పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా …

Read More »

కామారెడ్డిలో శరన్నవరాత్రి ఉత్సవాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని తూర్పు హౌసింగ్‌ బోర్డు కాలనీ శ్రీ శారద మాత శ్రీ అభయాంజనేయ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మహిపాల్‌ రెడ్డి మాట్లాడుతూ శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 26 నుండి వచ్చే నెల అక్టోబర్‌ 5 తేదీ …

Read More »

గ్రూప్‌ -1 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రూప్‌ -1 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం రాత్రి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 10 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేంద్రాల్లో ఫర్నిచర్‌, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం ఉండే విధంగా చూడాలన్నారు. అక్టోబర్‌ 16న టీఎస్పీఎస్‌ …

Read More »

పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు

ఎడపల్లి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిచ్చి కుక్క దాడిలో ఓ మహిళతో పాటు 5 ఏండ్ల పాపకు, సంవత్సరంన్నర ఓ బాలునికి తీవ్ర గాయాలైన ఘటన ఎడపల్లి మండలంలోని జానకంపేట్‌ గ్రామంలో చోటుచేసుకోంది. వివరాలిలా ఉన్నాయి. జానకంపెట్‌ గ్రామానికి చెందిన బ్యాగరి సంపత్‌ భార్య సుజాత ఇంటివద్ద ఊడ్చే క్రమంలో పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చింది. అంతేకాదు వారి ఏడాదిన్నర కుమారుడు ఇంట్లో గేటులోపల …

Read More »

సామాజిక సమైక్యతకు బతుకమ్మ పండుగ దోహదపడుతుంది

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను బతుకమ్మ పండగ చాటి చెప్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. బతుకమ్మ పండుగను ఘనంగా జరిపేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. సామాజిక సమైక్యతకు ఈ పండుగ దోహదపడుతుందని తెలిపారు. పూలనే దేవతగా మహిళలు …

Read More »

పలుగుట్ట భూమి పరిరక్షణే ద్యేయం…

నందిపేట్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణ, పల్గుట్ట భూమి పరిరక్షణే ద్యేయంగా ఆశ్రమం కృషి చేస్తున్నదని నందిపేట్‌ మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్‌ పేర్కొన్నారు. ఆశ్రమ సభ్యులతో కలిసి శనివారం ఆశ్రమ హాల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న వదంతులపై వివరణ ఇచ్చారు. తనకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పటి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »