నిజామాబాద్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాయుధ పోరాట యోధురాలు, బీసీల నిప్పు కణిక, ధీశాలి చాకలీ ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా వినాయకనగర్ హనుమాన్ జంక్షన్ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బిసి సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. బీసీలు తిరగబడితే దేన్నైనా సాధించవచ్చని ఇందుకు ఐలమ్మ చరిత్రే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా బీసీలు మేలుకొని తమను తాము పరిపాలించు …
Read More »బిసి వసతి గృహం సంక్షేమ అధికారి సస్పెండ్
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ, అలసత్వం వహించిన బీర్కూర్ బిసి వసతి గృహం సంక్షేమ అధికారి (ఎఫ్‌ఏసి) ఆర్.సందీప్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్ నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ, చట్టబద్ధమైన విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నందుకు విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. …
Read More »జిల్లా ప్రజలకు గమనిక
నిజామాబాద్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం ప్రగతి భవన్‌లో నిర్వహిస్తూ వచ్చిన ప్రజావాణి కార్యక్రమం, ఇకపై కొత్త కలెక్టరేట్‌లో కొనసాగుతుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారిచే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ప్రారంభోత్సవం చేసుకున్న నేపధ్యంలో న్యూ కలెక్టరేట్ వేదికగా జిల్లా పాలన కొనసాగుతోందని …
Read More »టీయూలో కాళోజి జయంతి
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాలలోని మిని సెమినార్ హాల్‌లో కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ఆచార్య ఆరతి పెర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిష్ట్రార్ ఆచార్య విద్యావర్ధిని విచ్చేసి తెలంగాణ భాషాభివృద్ధికి కాళోజి చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతిని తెలంగాణ భాసా దినోత్సవంగా పాటించడం అభినందనీయమన్నారు. ముఖ్య వక్తగా విచ్చేసిన ఆచార్య కనకయ్య …
Read More »సార్వజనిక్ గణేష్ మండలి వద్ద కలెక్టర్ పూజలు
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం దుబ్బ ప్రాంతంలోని సార్వజనిక్ గణేష్ మండలి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర రథం వద్ద టెంకాయ కొట్టారు. ఈ సందర్భంగా సార్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు బంటు గణేష్ ఇతర ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు కలెక్టర్‌కు …
Read More »న్యూ కలెక్టరేట్‌లో ప్రజాకవి కాళోజీ జయంతి
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 108వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం (న్యూ కలెక్టరేట్) కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం, కాళోజీ చిత్రపటానికి పూలమాలలు …
Read More »రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…
కామారెడ్డి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వర్గం వెంకటేష్ (35) నార్సింగ్‌కు అత్యవసరంగా ఓ పాజిటివ్ ప్లేట్‌లెట్స్ అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన దినేష్ గౌడ్ స్పందించి సకాలంలో రక్త కణాలను అందజేశారని ఐవిఎఫ్ తెలంగాణ రక్తదాతల సమన్వయకర్త, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో …
Read More »ఘనంగా కాళోజీ జయంతి
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వైతాళికుడు, ప్రజా కవి, కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా గాజుల్ పెట్‌లోని కాళోజీ విగ్రహానికి నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై తన కవిత్వాల ద్వారా ప్రజలలో ఏర్పాటు ఆవశ్యకతను చేరవేసి మన …
Read More »సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయులు సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్‌లో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు నిరంతరం శ్రద్ధ పెట్టి …
Read More »గిరిరాజ్ కళాశాలలో తెలంగాణ భాషా దినోత్సవం
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం తెలుగు విభాగం ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 108వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భాష- యాసను కాళోజి తన కవిత్వం ద్వారా బతికించిన విధానాన్ని లఘు చిత్రం (డాక్యుమెంటరీ) రూపంలో ప్రదర్శించారు. సభాధ్యక్షులు ప్రిన్సిపాల్ …
Read More »