నిజామాబాద్, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంట రుణాల పంపిణీలో బ్యాంకర్లు అలసత్వ వైఖరి ప్రదర్శించడం పట్ల కలెక్టర్ సి.నారాయణరెడ్డి అసంతృప్తి వెలిబుచ్చారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనప్పటికీ పంటల సాగు కోసం అవసరమైన రుణాలను రైతాంగానికి పంపిణీ చేయడంలో పలు బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నాయని అన్నారు. ఏది ఎంతమాత్రం సమంజసం కాదని, పనితీరు మార్చుకొని పక్షంలో జిల్లా యంత్రాంగం తరపున కఠిన …
Read More »జనహిత గణేష్ మండలి లడ్డూ వేలం
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ జనహిత గణేష్ మండలి గణపతి లడ్డు ధర రూ.17 500 పలికింది. గురువారం గణపతి లడ్డుకు వేలంపాట నిర్వహించారు. లడ్డు దక్కించుకోవడానికి ఇద్దరు ఉద్యోగులు పోటీపడ్డారు. జిల్లా ఎడి మైన్స్ అధికారి నర్సిరెడ్డి రూ.17,000 పాడారు. చివరకు టీఎన్జీవోఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. సాయిలు రూ.17,500 పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సాయిలును …
Read More »ఓయులో రెండురోజుల వర్క్‌షాప్
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విద్యార్థులకు ప్రపంచ ఉపాధి, విద్యావకాశాలను సృష్టించేందుకు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఫ్రెంచ్‌ను ద్వితీయ భాషా సిలబస్‌గా సవరించాలని నిర్ణయించింది, కామన్ యూరోపియన్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ రెఫరెన్స్ ప్రకారం రూపొందించిన అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఏకరీతి సిలబస్‌ను ప్రారంభించింది. సవరించిన సిలబస్ ఉపయోగించాల్సిన బోధనా సాధనాలపై ఫ్రెంచ్ భాషా ఉపాధ్యాయులకు నైపుణ్యాన్ని పెంపొందించడానికి, చైర్మన్, టిఎస్‌సిహెచ్‌ఇ 2022 …
Read More »అనాథ వృద్దురాలికి అంత్యక్రియలు
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిపట్టణంలోని అనాథ వృద్ధురాలికి అనాథ ఆశ్రమం వ్యవస్థాపకులు దాస్ ఎల్లం సుగుణ అంత్యక్రియలు నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని రామరెడ్డి చౌరస్తాలో కిరాయికి ఉంటున్న అంగోత్ లక్ష్మీ (75), ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరు లేక అనాథగా జీవిస్తున్నారు. వారు ఉంటున్న కిరాయి రూమ్ ప్రమాదకరంగా ఉన్నందుకు ఖాళీచేసి, రూమ్ దొరకక, చివరకు కామారెడ్డిలో శాబ్దిపూర్ తండాలోని అనాథ ఆశ్రమంలో …
Read More »బాల్య వివాహాల నిర్మూలనకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్యవివాహాలు జరగకుండా గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి అధికారులతో బాల్య వివాహాల నిర్మూలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతినెల చివరి రోజున బాల్యవివాహాల నిర్మూలన, బడి మానేసిన పిల్లలపై గ్రామస్థాయిలో అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని …
Read More »నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. నిమజ్జనం చేయడానికి అవసరమైన క్రేన్‌లను సమకూర్చాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శీను, ఏఎస్పీ అన్యోన్య ,డిఎస్పి సోమనాథం, పోలీసులు పాల్గొన్నారు.
Read More »కాంగ్రెస్, బిజెపిలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 18, 19, 20, 21, 22, 23, 24 వార్డ్‌లకు చెందిన నూతన అసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో కామారెడ్డి వార్డుల్లో మంజూరైన 347 నూతన అసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. కొత్తగా పట్టణానికి 3 వేల 291 మందికి …
Read More »అత్యధిక అవార్డులు సాధించేలా చూడాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో అత్యధిక పంచాయతీ అవార్డులను కామారెడ్డి జిల్లా సాధించే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు గురువారం జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆన్లైన్ పోర్టల్‌లో ఈనెల 10వ తేదీ నుంచి గ్రామపంచాయతీలు అవార్డుల కోసం తప్పులు లేకుండా …
Read More »బస్సు బోల్తా, తృటిలో తప్పిన ప్రమాదం
నిజామాబాద్, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఐ రాష్ట్ర మూడో మహాసభలకు హాజరై శంషాబాద్ హైదరాబాద్ నుండి నిజామాబాద్ వస్తుండగా ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడిరది. బస్సులో ప్రయాణిస్తున్న సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న, జిల్లా కార్యదర్శి పి సుధాకర్, జిల్లా నాయకులు ఓమయ్య, రాజేశ్వర్‌లకు గాయాలయ్యాయి. గురువారం ఉదయం నాలుగు గంటలకు సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుండి బోధన్ డిపో సూపర్ లగ్జరీ …
Read More »జిపిలో లబ్దిదారుల జాబితా పెట్టండి
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త పెన్షన్ లిస్టు గ్రామపంచాయతీలో పెట్టాలని జిల్లా గ్రామ అభివృద్ధి అధికారి బి .సాయన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నా రెడ్డి మోహన్ రెడ్డి, పోసానిపేట్ గ్రామసర్పంచ్ గీ రెడ్డి, మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »