కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నుంచి లింగంపేట్ కు వెళ్లే మార్గమధ్య ముస్తాపూర్ గ్రామ శివారులో లారీ బోల్తా పడిరది. కాగా లారీలో ఉన్న డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్ప గాయాలు అయిన వారిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. లారీ నెంబర్ టిఎస్ 15 యు 7888. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »చదువుతూనే ఉద్యోగం – గొప్ప అవకాశం
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెచ్.సి.ఎల్. టెక్ బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాంలో చేరి, చదువుతూనే ఉపాధి అవకాశం పొందడం గొప్పవరం అని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రఘురాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు హెచ్.సి.ఎల్. టెక్ సంస్థ ఆధ్వర్యంలో 2021-22 విద్యా సంవత్సరం …
Read More »పంటల సాగు వివరాలను పక్కాగా సేకరించాలి
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రైతులు సాగు చేస్తున్న వివిధ పంటల వివరాలను పక్కాగా సేకరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో గురువారం సాయంత్రం వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇటీవల దాదాపు నెల రోజుల పాటు ఏకధాటిగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పలుచోట్ల దెబ్బతిన్న పంటల స్థానంలో కొందరు రైతులు తిరిగి …
Read More »ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో, ప్రముఖ ప్రైవేట్ కార్మిక కేంద్రాలలో పనిచేసి రిటైర్ అయిన ఈపీఎస్ పెన్షనర్లకు, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ. 9000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం నిజాంబాద్‌లోని రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి …
Read More »జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనం పెంపొందించాలి
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా మీదుగా వెళ్తున్న 44 వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనం పెంపొందించేలా పక్కా ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా సరిహద్దు ప్రాంతమైన చంద్రాయన్పల్లి నుండి డిచ్‌పల్లి వరకు హైవేకు ఆనుకుని నాటిన మొక్కలను పరిశీలించారు. అక్కడక్కడా లోపాలను గమనించిన కలెక్టర్, తక్షణమే …
Read More »టీయూకు రూ. 25 కోట్ల ప్రతిపాదనలకు సానుకూల స్పందన
డిచ్‌పల్లి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయానికి డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియా నుంచి 25 కోట్ల నిధులకు సానుకూల స్పందన వచ్చిందని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా న్యూఢల్లీి పర్యటనలో ఉన్న వీసీ డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ డా. చంద్రశేఖర్ శ్రీవారిని కలిసి శాలువాతో సత్కరించారు. అదే విధంగా …
Read More »కామారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ బదిలీ
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ బుధవారం బదిలీపై హైదరాబాద్ కూకట్ పల్లి కోర్ట్ కి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వైద్య అమృతరావు మాట్లాడుతూ గత మూడున్నర …
Read More »నేటి సమాజానికి ఆదర్శం బాలు
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఎస్‌ఆర్కె డిగ్రీ పీజీ కళాశాలలో బుధవారం తెలంగాణ యూనివర్సిటీ నుండి అర్థశాస్త్రంలో డాక్టరేట్ పొందిన టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలును ఆర్కే విద్యాసంస్థల సెక్రటరీ, కరస్పాండెంట్ జైపాల్ రెడ్డి, ఎస్‌ఆర్కె డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ దత్తాద్రి సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల సీఈవో జైపాల్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవలో …
Read More »ఇన్‌చార్జి డిపిఆర్‌వోగా రవికుమార్
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఇంచార్జ్ డిపిఆర్‌ఓగా బి. రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట డిపిఆర్‌ఓగా ఉన్న రవికుమార్‌కు కామారెడ్డి ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు ఇంచార్జి గా పనిచేసిన దశరథం, రవికుమార్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు డిపిఆర్‌ఓ రవికుమార్ మొక్కను అందజేశారు. మర్యాదపూర్వకంగా కలిశారు.
Read More »ఉద్యానవన శాఖ పనులు తక్షణమే పూర్తిచేయాలి
కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రూర్బన్లో ఉద్యానవన శాఖ పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్లో ఉద్యానవన శాఖ ద్వారా చేపట్టిన పనులపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 30లోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఆర్డిఓ సాయన్న, …
Read More »