NizamabadNews

పకడ్బందీగా ఆపరేషన్‌ ముస్కాన్‌ అమలు

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చదువుకునే వయస్సు కలిగి ఉన్న బాలలను పనులలో కొనసాగించడం నేరమని, అలాంటి బాలలను గుర్తించేందుకు చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ ముస్కాన్‌ అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆయా …

Read More »

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో సీజనల్‌ వ్యాధుల నివారణపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మలేరియా, డెంగ్యూ, చికున్‌ గున్యా, విష జ్వరాలు వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందు …

Read More »

ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

డిచ్‌పల్లి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని డిఆర్డిఓ పిడి సాయన్న అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఈ సందర్భంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపి పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జడ్పీ …

Read More »

సెంట్రల్‌ యూనివర్సిటి ఆఫ్‌ కేరళకి డా. రాంబాబు

డిచ్‌పల్లి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలలో కామర్స్‌ విభాగాధిపతి, పాఠ్యప్రణాళికా సంఘ చైర్‌ పర్సన్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. రాంబాబు గోపిసెట్టి కేరళ రాష్ట్రంలో గల సెంట్రల్‌ యూనివర్సిటి ఆఫ్‌ కేరళలో కామర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా నియామకం పొందారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ సోమవారం …

Read More »

ఆటో, బైకు ఢీ, పలువురికి గాయాలు

ఎడపల్లి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎదురెదురుగా వెళుతున్న బైకు, ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్‌తో పాటు బైక్‌పై వెళుతున్న ముగ్గురికి తీవ గాయాలైన ఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. కుర్నాపల్లి నుంచి జానకంపేట్‌ వైపు వెళుతున్న టిఎస్‌ 34 టిఎ 2044 నెంబరు గల ఆటో జానకంపేట గ్రామ శివారుకు రాగానే కుర్నాపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ …

Read More »

శాస్త్రీయ పద్ధతిలో పంటలు పండిరచి లాభాలు పొందండి…

నందిపేట్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్ర రైతు వేదికలో క్షేత్ర ప్రదర్శనపై శిక్షణ తరగతులు నిర్వహించారు. నందిపేట మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికలో శనివారం రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించి పలు సూచనలు చేశారు. శాస్త్ర వేత్తలు మాట్లాడుతు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని శాస్త్రీయ పద్ధతులతో వ్యవసాయాన్ని చేయాలని రైతులకు తెలిపారు. …

Read More »

టీయూ నుంచి యూఎస్‌కు

డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీలో పీజీ చేసిన విద్యార్థి కొప్పుల అనురాగ్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలో గల మిచిగన్‌ టెక్నాలజికల్‌ యూనివర్సిటీలో హెల్త్‌ ఇన్‌ ఫర్మేటిక్స్‌ కోర్సు చేయడానికి ఎం. ఎస్‌. అడ్మిషన్స్‌ పొందారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ కొప్పుల అనురాగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ చేసిన విద్యార్థులలో అమెరికాలో …

Read More »

ఉషోదయ, ఎంఎస్‌ఆర్‌ కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు

డిచ్‌పల్లి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గల ఉషోదయ డిగ్రీ కళాశాల, ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాల మరియు ఎంఎస్‌ఆర్‌ కళాశాలలకు షోకాజ్‌ నోటీసులను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ జారీ చేశారు. బోధన్‌ ఉషోదయ డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, నిజామాబాద్‌ ఎంఎస్‌ఆర్‌ కళాశాలకు నోటీసులు అందాయి. ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ …

Read More »

ఐదుగురు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు శనివారం కూడా ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు …

Read More »

బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌లో సాయిరాంకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో పరిశోధక విద్యార్థి శ్రీపాద సాయిరాంకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా – వోస్‌ (మౌఖిక పరీక్ష) శనివారం ఉదయం కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలలోని సెమినార్‌ హాల్‌లో నిర్వహించారు. బిజినేస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలోని అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మరియు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »