NizamabadNews

మొక్కలు నాటడానికి గుంతలు తీయించాలి

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని నర్సరీని సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. నర్సరీలో ఉన్న మొక్కలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ఖాళీ స్థలాలను గుర్తించి హరిత హారంలో మొక్కలు నాటడానికి గుంతలు తీయించాలని అధికారులకు సూచించారు. గృహాలకు ఇవ్వడానికి అనువైన మొక్కలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, …

Read More »

జిల్లా ప్రజలకు రంజాన్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా మండుటెండల్లోనూ ముస్లిం మైనారిటీలు ఎంతో నియమ నిష్ఠతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించారని అన్నారు. ఉపవాస …

Read More »

టీయూ న్యాయ విభాగంలో మూట్‌ – కోర్ట్‌

డిచ్‌పల్లి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగంలో విభాగాధిపతి, బిఒఎస్‌ చైర్‌ పర్సన్‌ డా. బి. స్రవంతి ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌బి కోర్సుకు చెందిన ఆరవ సెమిస్టర్‌ విద్యార్థులకు సోమవారం నమునా – కోర్టు (మూట్‌ – కోర్ట్‌) నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా కోర్ట్‌ నుంచి సీనియర్‌ అడ్వకేట్‌ రామాగౌడ్‌ ఎక్స్‌ టర్నల్‌ ఎగ్జామినర్‌గా విచ్చేశారు. విద్యార్థులు నమూనా కోర్టు విధి విధానాలు, …

Read More »

ఆయిల్‌ పామ్‌ నర్సరీని సందర్శించిన మంత్రి

ఆర్మూర్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ వద్ద గల ఆయిల్‌ పామ్‌ నర్సరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సోమవారం సందర్శించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డిలతో కలిసి నర్సరీలో పెరుగుతున్న ఆయిల్‌ పామ్‌ మొక్కలను పరిశీలించారు. మొక్కల పెంపకం కోసం అవలంభిస్తున్న పద్ధతుల గురించి, వాటి పంపిణీ కోసం రూపొందించిన …

Read More »

ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 67 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ …

Read More »

ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రజా విజ్ఞప్తులు, ఫిర్యాదులను సత్వరం పరిష్కారం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలోజిల్లా పరిషత్‌ సీఈవో సాయా గౌడ్‌, కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read More »

వేసవి శిక్షణా శిబిరాన్ని వినియోగించుకోవాలి

కామారెడ్డి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్నారులు వేసవి శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియం లో ఆదివారం అథ్లెటిక్స్‌ వేసవి శిక్షణ శిబిరంను జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడల వల్ల విద్యార్థులలో క్రమశిక్షణ పెరుగుతోందని సూచించారు. క్రీడల వల్ల స్నేహభావం పెరుగుతోందని చెప్పారు. క్రీడలు శారీరక …

Read More »

మహిళా సంక్షేమమే కేసిఆర్‌ ప్రభుత్వ లక్ష్యం

వేల్పూర్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా సంక్షేమంతో పాటు వారు ఆర్దికంగా వృద్ది సాధించడమే కేసిఆర్‌ ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా డిఆర్‌డిఎ పి.డి చందర్‌ నాయక్‌, నియోజకవర్గ …

Read More »

భారతదేశ ఫార్మా ఉత్పత్తులు అత్యంత ప్రాముఖ్యత పొందాయి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘‘ఇండియన్‌ ఫార్మా విజన్‌: ఇన్నోవేషన్స్‌ అండ్‌ ఇంపాక్ట్స్‌’’ అనే అంశంపై న్యాయ కాళాశాలలోని సమావేశ మందిరంలో శనివారం గెస్ట్‌ లెక్చర్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ విచ్చేసి మాట్లాడారు. భారతదేశ ఫార్మా ఉత్పత్తులు అత్యంత ప్రాముఖ్యత పొందాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న …

Read More »

హరితహారం కోసం స్థలాలు ఎంపిక చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరిత హారంలో మొక్కలు నాటడానికి గ్రామాల్లోని చెరువు కట్టలు, కాలువల గట్ల స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో శనివారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఇరిగేషన్‌, ఉపాధి హామీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల వారిగా హరిత హారంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »