NizamabadNews

మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు నిజామాబాద్‌ జిల్లా పర్యటనకు హాజరవుతున్న క్రమంలో ఆయన పర్యటన ఏర్పాట్లను గురువారం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కె ఆర్‌ నాగరాజు పరిశీలించారు. నిజాంసాగర్‌ మెయిన్‌ కెనాల్‌ను ఆధారంగా చేసుకుని సుమారు 106 కోట్ల రూపాయల వ్యయంతో జాకోరా, చందూర్‌ గ్రామాల వద్ద చేపడుతున్న ఎత్తిపోతల పథకాల …

Read More »

పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఇంటర్‌, ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై గురువారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ …

Read More »

కరోనా నిబంధనలు పాటిస్తూ ఎగ్జామ్స్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నిబంధనలు పాటిస్తూ పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. జిల్లాలో పదో తరగతి పరీక్ష కేంద్రాలు …

Read More »

హెల్త్‌ కార్డులు నడవటం లేదు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంప్లాయిస్‌, పెన్షనర్స్‌, జర్నలిస్టుల హెల్త్‌ కార్డులపై , నగదు రహిత వైద్యం చేయడానికి ప్రయివేట్‌ అండ్‌ కార్పొరేట్‌ ఆసుపత్రులు నిరా కరిస్తున్నాయని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డు పర్సన్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు, ప్రధాన కార్యదర్శి కే .రామ్మోహన్రావు తెలిపారు. పనికిరాని ఈ హెల్త్‌ కార్డులెందుకని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు వాపోతున్నారు. …

Read More »

వైద్యారోగ్య శాఖ పనితీరుపై నిరంతర పర్యవేక్షణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరును గాడిన పెట్టే చర్యల్లో భాగంగా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బుధవారం సాయంత్రం ఆ శాఖ అధికారులు, సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయి నుండి మొదలుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వరకు వివిధ దశల్లో చేపట్టాల్సిన పనులను పూర్తి అంకితభావంతో సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. నిర్దిష్ట గడువులోగా …

Read More »

టీయూలో కోచింగ్‌ సెంటర్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం వెలువడుతున్న ప్రభుత్వ పరీక్షల పోటీల శిక్షణా కేంద్రం (కాంపిటీటీవ్‌ ఎగ్జామినేషన్స్‌ కోచింగ్‌ సెంటర్‌) ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 29 వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలోని సెమినార్‌ హాల్‌లో నిర్వహింపబడుతుందని డైరెక్టర్‌ డా. జి. బాల శ్రీనివాస మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ …

Read More »

మే 10 నుంచి పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు (ఎపిఇ, పిసిహెచ్‌ అండ్‌ ఐఎంబిఎ) లకు చెందిన మొదటి, మూడవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్‌ మరియు ఐఎంబిఎ, ఎపిఇ, పిసిహెచ్‌ ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ …

Read More »

ఉద్యోగ సాధనే ఆశ..శ్వాస కావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ సాధనే ఆశ..శ్వాసగా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అభ్యర్థులకు సూచించారు. గ్రూప్‌ ఎగ్జామ్స్‌ రాస్తున్న వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను కలెక్టర్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోటీ పరీక్షల్లో గెలుపు ఓటములకు మధ్య కేవలం ఒక్క మార్కు తేడా …

Read More »

నిజామాబాద్‌ జిల్లాకు గుడ్‌ న్యూస్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో మొదటి పది ఆదర్శ గ్రామాలు మన తెలంగాణవే! ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ తన వెబ్‌ సైట్‌ లో పేర్కొన్నది. సన్సద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజన పథకం కింద ఎంపికైన గ్రామాల వివరాలను తాజాగా ఆ వెబ్‌ సైట్‌లో పెట్టారు. అంతేకాదు, దేశంలోని మొదటి 20 ఆదర్శ గ్రామాల్లో 19 గ్రామాలు కూడా మన …

Read More »

ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే సహించే ప్రసక్తే లేదు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అస్తవ్యస్తంగా తయారైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరులో మార్పు తప్పనిసరిగా రావాల్సిందేనని కలెక్టర్‌ స్పష్టం చేశారు. విధుల పట్ల ఎవరైనా అలసత్వం వహిస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఎంత మాత్రం ఉపేక్షించబోమని ఘాటుగా హెచ్చరించారు. పని చేయడం ఇష్టం లేకపోతే విధుల నుండి పక్కకు తప్పుకోవాలని కరాఖండిగా తేల్చి చెప్పారు. ఇకపై తన అనుమతి లేకుండా వైద్యాధికారులు మొదలుకొని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »