NizamabadNews

రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌

నందిపేట్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో బుధవారం తెరాస మండల నాయకులు ఎంపిపి సంతోష్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి చిత్రపటానికి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద పాలాభిషేకం చేసి జై కేసీఆర్‌ జై జీవన్‌ రెడ్డి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంతోష్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చెయ్యమని చేతులెత్తేసినప్పటికి …

Read More »

కామారెడ్డిలో 345 కొనుగోలు కేంద్రాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ పై కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగి సీజన్‌ లో జిల్లా రైతులు పండిరచిన ధాన్యాన్ని కొంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »

పిహెచ్‌. డి. నోటిఫికేషన్‌ విడుదల

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌లో డీన్‌ ఆచార్య పి. కనకయ్య ఆధ్వర్యంలో బుధవారం పిహెచ్‌. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 1 నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ విభాగాలలో క్యాటిగిరి – 1 కి చెందిన యూజీసీ జెఆర్‌ఎఫ్‌ మరియు ఏదైనా నేషనల్‌ సంస్థ నుంచి …

Read More »

ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశ్రమల తరహాలోనే వ్యవసాయ రంగం కూడా లాభసాటిగా మారాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆకాంక్షించారు. రైతులు మూస ధోరణిని వీడి, అభివృద్ధి చెందిన సాంకేతికతను జోడిస్తూ ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేసినప్పుడే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ దిశా రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు. ప్రధానంగా ఆదర్శ రైతులు, రైతు …

Read More »

14 నుండి అగ్నిమాపక వారోత్సవాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అగ్నిమాపక శాఖ వారోత్సవాల వాల్‌ పోస్టర్లను బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్‌ మాల్స్‌, …

Read More »

బి.ఎడ్‌. పరీక్షల ఫలితాల వెల్లడి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ బి.ఎడ్‌. కళాశాలలో గల రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షల ఫలితాలు బుధవారం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఫలితాల్లో మొత్తం 1290 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1184 మంది ఉత్తీర్ణులు, 106 మంది ప్రమోటెడ్‌ అయినారు. ఉత్తీర్ణతా శాతం 91.78 శాతంగా నమోదు అయ్యింది. ఫలితాల …

Read More »

కామారెడ్డిలో వంటా వార్పు

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ చౌక్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వంటా వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాస్‌ రావ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు, అలాగే రాష్ట్రప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలు, యాసంగి వరి ధాన్యాన్ని కొనకుండా కేంద్రంపై …

Read More »

వారం రోజుల్లో ఆయుష్‌ వెల్‌ నెస్‌ సెంటర్‌ నిర్మాణం పూర్తి చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి లో నిర్మిస్తున్న ఆయుష్‌ వెల్‌ నెస్‌ సెంటర్‌ ను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం గాంధారీ కమ్మ్యూనీటి హెల్త్‌ సెంటర్‌ సమీపంలో పైలట్‌ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న ఆయుష్‌ వెల్‌ నెస్‌ సెంటర్‌ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆయుష్‌ వెల్‌ నెస్‌ …

Read More »

కల్కి భగవాన్‌ ఆలయంలో అన్నదానం..

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి భగవాన్‌ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమము జరిగింది. అన్నదాన కార్యక్రమానికి ఆన్నదాతలుగా ప్రకాష్‌ మౌనిక, ఉప్పల అంతయ్య నాగమణి దంపతులు, గజవాడ నాగరాజు, గజవాడ అరవింద్‌ సహాయం చేశారు. వీరికి ఆలయ భక్తబృందం ఆధ్వర్యంలో సన్మానించారు. ప్రతి మంగళవారం అన్నదానానికి ముందుకు వచ్చేవారు ఆలయంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సేవకులు …

Read More »

రెడ్‌ క్రాస్‌ సభ్యుడికి ఘన నివాళి

దోమకొండ, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండల కేంద్రానికి చెందిన ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జీవితకాల సభ్యుడు డాక్టర్‌ హన్మయ్య పరమపదించి నేటికీ సంవత్సరం అయిన తరుణంలో ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మండలంలోని ప్రజలకు వైద్యుడిగా అయన చేసిన సేవలు కొనియాడి నివాళులు అర్పించారు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా వైస్‌ చైర్మన్‌ అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌, మండల టీఆర్‌ఎస్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »