NizamabadNews

మార్చి 7న ప్లాట్ల వేలంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 7న సోమవారం ఉదయం 11:00 గంటలకు రాజీవ్‌ స్వగృహ (ధరణి టౌన్షిప్‌) లో ప్లాట్ల బహిరంగ వేలంపై గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. బుధవారం ఆయన ధరణి టౌన్‌షిప్‌లో స్థిర వ్యాపారుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్చి 14 నుంచి …

Read More »

శివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహా శివరాత్రి సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్దికుంట లోని బుగ్గ రామలింగేశ్వర మందిరంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్‌ అలీ షబ్బీర్‌ పాల్గొన్నారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుస్తే మట్టెలు సమర్పించారు. పార్వతీ పరమేశ్వరులకు ప్రజలు నీరాజనం పలికారు. స్వాగత తోరణం నుండి నుంచి కళ్యాణవేదిక వరకు శోభాయాత్ర …

Read More »

శివనామస్మరణతో మారుమ్రోగిన శైవక్షేత్రాలు

మోర్తాడ్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవజాతి కోరిన కోర్కెలు తీర్చే దైవం మహాదేవుడి నేడు పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అశేష భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల, కమ్మర్పల్లి, వేల్పూర్‌, మెండోరా, మోర్తాడ్‌ మండలాలలోని ఆయా గ్రామాలలో మంగళవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆయా గ్రామాలలోని శివాలయాలలో భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆయా …

Read More »

రక్తదానం పట్ల అపోహలు వీడండి

కామారెడ్డి, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయి కృష్ణ వైద్యశాలలో లింగంపేట మండలము పరమళ్ల గ్రామానికి చెందిన సావిత్రి (28) కి గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త బాలుకు తెలియజేయడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్‌ వేదప్రకాష్‌ వెంటనే స్పందించి సకాలములో రక్తాన్ని అందజేసి ప్రాణాలను …

Read More »

జిల్లావాసికి ‘‘హిందీ యౌద్ధ’’ పురస్కారం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండోర్‌లో జరిగిన హిందీ గౌరవ్‌, కావ్య గౌరవ్‌, హిందీ యోద్ధ పురస్కార సన్మాన వేడుకలో సీనియర్‌ జర్నలిస్టు మరియు విశ్లేషకులు కృష్ణ కుమార్‌ అష్టాన మరియు సీనియర్‌ కథా రచయిత్రి డా. కృష్ణ అగ్నిహోత్రికికి హిందీ గౌరవ్‌, అలాగే శ్రీమన్నారాయణాచార్యకు ‘‘హిందీ యౌద్ధ’’ పురస్కార సమ్మానం లభించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ కేబినెట్‌ మంత్రి తులసి …

Read More »

జిల్లా ప్రజలకు శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పరమశివుని కృపతో జిల్లా అన్ని రంగాలలో మరింతగా అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడి దీవెనలు కోరుతూ ఆధ్యాత్మిక …

Read More »

2న ప్లాట్ల వేలంపై అవగాహన సమావేశం

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 2న బుధవారం ఉదయం 11 గంటలకు రాజీవ్‌ స్వగృహ (ధరణి టౌన్షిప్‌) లో ప్లాట్ల బహిరంగ వేలంపై అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. సమావేశానికి జిల్లాలోని రియల్‌ ఎస్టేట్‌ (స్థిరాస్తి వ్యాపారులు), ఇతరులు ఆసక్తి గల వ్యక్తులు హాజరు కావాలని కోరారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Read More »

చిన్నారుల వివరాలు యాప్‌లో నమోదు చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలను గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి నెల రెండు రోజులపాటు అంగన్‌వాడి కార్యకర్తలు పిల్లల బరువు, ఎత్తు వివరాలను చూసి యాప్‌లో నమోదు చేయాలని …

Read More »

టియులో జాతీయ సైన్స్‌ డే వేడుకలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ కళాశాల సమావేశ మందిరంలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘‘జాతీయ సైన్స్‌ డే వేడుకలు’’ సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి, తెలంగాణ విశ్వవిద్యాల్య ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్‌ ఆచార్య టి. …

Read More »

ప్రశాంతంగా ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షల్లో మొత్తం 8754 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »