గాంధారి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్న బాధితునికి ఆక్సిజన్ కాన్సర్ట్రేటర్‌ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అందజేశారు. గాంధారి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వడ్ల సత్తయ్యకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే సురేందర్‌ను కలిసి పరిస్థితి వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆక్సిజన్ కాన్సర్ట్రేటర్‌ను ఉచితంగా తన సహచరలతో పంపించారు. ఆక్సిజన్ పరికరాన్ని …
Read More »కాంగ్రెస్ ఆధ్వర్యంలో మౌన దీక్ష
గాంధారి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మౌన దీక్ష చేపట్టారు. సోమవారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్బంగా కాంగ్రెస్ శాసన సభ ప్రతిపక్ష నాయకుడు బట్టీ విక్రమార్కను అసెంబ్లీ లో అవమాన కరంగా మాట్లాడం మండల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా టి పీసీసీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం …
Read More »గాంధారిలో ఘనంగా మహిళా దినోత్సవం
గాంధారి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గాంధారిలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను స్థానిక తహసీల్దార్ ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్ శిల్పతో పాటు మహిళా ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ తూర్పు రాజులు, స్కూల్ చైర్మన్ గంగామణి, కాంగ్రెస్ నాయకులు కృష్ణ, నీల రవి తదితరులు పాల్గొన్నారు.
Read More »సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అనిర్వచనీయం
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజ అభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని వక్తలు కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ మరింత అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అట్టహాసంగా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగాల …
Read More »గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన టిఎస్‌పిఎస్ సభ్యురాలు
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం టిఎస్‌పిఎస్ సభ్యురాలు సుమిత్రానందన్ మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ బాధ్యతను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిని సరస్వతి, జిల్లా బాల రక్షణ అధికారిని స్రవంతి, సిడబ్ల్యూసి సభ్యురాలు స్వర్ణలత, …
Read More »పెండిరగ్ ఉపకారవేతనాల దరఖాస్తులు రెండు రోజుల్లో పూర్తి చేయాలి
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బిసి శాఖల వారీగా పెండిరగ్ దరఖాస్తులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన జిల్లా సంక్షేమ అధికారులతో, కళాశాలల ప్రిన్సిపాళ్లతో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత ఉన్న …
Read More »యువతకు విలువలతో కూడిన చదువులు అవసరం
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి యువతకు విలువలతో కూడిన చదువులు అవసరమని కామారెడ్డి జిల్లా కోర్టు జడ్జి రమేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ హాలులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జడ్జి రమేష్ బాబు మాట్లాడుతూ మహిళా శక్తి …
Read More »సమాజంలో మహిళలు, పురుషులు సమానంగా భావించాలి
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో మహిళలు, పురుషులు సమానమేనని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కామారెడ్డి పట్టణంలోని తాహెర్ గార్డెన్‌లో మంగళవారం ఐసిడిఎస్, ఫీల్డ్ ఔట్రీచ్ బ్యూరో, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »కోమటి చెరువు అందాలకు కామారెడ్డి కలెక్టర్ ఫిదా
కామారెడ్డి, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోమటి చెరువు అందాలకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఫిదా అయ్యారు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసిజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోమటి చెరువును సందర్శించారు. తీగెల వంతెనపై కాలినడకన కోమటి చెరువు అందాలను వీక్షించారు. చెరువులో బోటు షికారు చేస్తూ లేజర్ లైట్, మ్యూజికల్ ఫౌంటెన్ షోను తిలకించి మంత్ర ముగ్ధులయ్యారు. …
Read More »ప్రభుత్వ బడుల్లో అవసరం ఉన్న పనులనే చేపట్టాలి
నిజామాబాద్, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద తొలి విడతలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో అవసరం ఉన్న పనులను మాత్రమే గుర్తించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో ఆయన సంబంధిత శాఖల అధికారులతో మన ఊరు – మన బడి, హరితహారం, దళిత బంధు, ఉపాధి హామీ అమలు తీరుపై …
Read More »