నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 76 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత …
Read More »మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు తయారుచేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా మండలాల వారీగా 100 మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలను గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. పాఠశాలలో అదనపు గదులు, మౌలిక వసతుల కోసం అధికారులు …
Read More »ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. శాఖల వారీగా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా …
Read More »18న మేడారం వెళ్లనున్న సీఎం
హైదరాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా జారతకు వస్తారన్నారు. జాతరకు అన్ని వర్గాల ప్రజలు సహరించాలని కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జాతర విజయవంతం చేయాలన్నారు. మేడారం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా 34 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. …
Read More »22 నుంచి బి.ఎడ్. ఎగ్జామ్స్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ బి.ఎడ్. కళాశాలలోని రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 22 నుంచి 25 వ తేదీ వరకు జరుగనున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ రివైస్డ్ షెడ్యూల్డ్ వెలువరించారు. పరీక్షలు ఉదయం 10-12 గంటల వరకు, గిరిరాజ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో జరుగుతాయన్నారు. కావున ఈ …
Read More »టియులో అంతర్ డిగ్రీ, పీజీ కాలేజ్ క్రికెట్ టోర్నీ ….
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 17 వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, టిఎస్ ఆర్‌టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో అంతర్ డిగ్రి మరియు పీజీ కళాశాలాల టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి జేఏసి అధ్యక్షుడు యెండల ప్రదీప్, టిఆర్‌ఎస్‌వి జిల్లా కో ఆర్డినెటర్ శ్రీనివాస్ గౌడ్, …
Read More »మీ సేవ ద్వారా సమ్మక్క సారలమ్మ జాతర ప్రసాదం
నిజామాబాద్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ జాతర ప్రసాదంను మీ సేవ ద్వారా అందించేలా ఏర్పాట్లు చేసిందని ఈ-సేవ జిల్లా మేనేజర్ కార్తీక్ తెలిపారు. భక్త్తులు తమ సమీపంలోని మీ సేవా కేంద్రంలో 225 రూపాయలు చెల్లిస్తే, కొరియర్ ద్వారా నేరుగా ఇంటికే సమ్మక్క సారలమ్మ జాతర ప్రసాదంను పంపించడం జరుగుతుందన్నారు. భక్తులు చెల్లించే 225 …
Read More »రక్తదానం పట్ల అపోహలను విడనాడాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలలో ఆపరేషన్ల నిమిత్తమై కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ మరియు ఖైరున్నిస్సా బేగం లకు కావలసిన ఏబి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త,కామారెడ్డి రక్తదాతల సమూహం నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో పట్టణానికి చెందిన హష్మీ మరియు మల్కాపూర్ గ్రామానికి చెందిన …
Read More »గ్రామస్థాయి నుండి తెరాసకు షాక్
కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో బీజేపీ జెండాను కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం గ్రామానికి చెందిన 43 మంది యువకులు కాషాయ కండువా కప్పుకొని బీజేపిలో చేరారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన …
Read More »మొదటి విడతలో 9123 పాఠశాలలు గుర్తించాము
కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 9123 పాఠశాలలను మన ఊరు మన బడి మొదటి విడతలో గుర్తించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం మన ఊరు -మన బడి కార్యక్రమం అమలులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా …
Read More »