NizamabadNews

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 59 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. …

Read More »

జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షన్‌ బృందాలు

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగు రోజుల్లో జిల్లాలోని వివిధ గ్రామాలను స్వచ్ఛ సర్వేక్షన్‌ బృందాలు పర్యటిస్తాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరై అధికారులతో మాట్లాడారు. గ్రామాల్లోని పాఠశాలలు, పంచాయతీ భవనాలు, ఆరోగ్య కేంద్రం భవనాలు, అంగన్‌వాడి భవనాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని సూచించారు. మంగళవారం ఉదయం …

Read More »

స్టేడియంను పరిశీలించిన కలెక్టర్‌

కామరెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంను సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. గదిలో ఉన్న క్రీడా పరికరాలను పరిశీలించారు. వీటిని క్రీడాకారులు వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట జిల్లా క్రీడలు, యువజన సర్వీసులు అధికారి దామోదర్‌ రెడ్డి, తహసీల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌, అధికారులు ఉన్నారు.

Read More »

సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుంది

కామరెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్‌ పాఠశాలలో సోమవారం ఆజాదీకా అమృత మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా యజ్ఞ సహిత యోగా సూర్య నమస్కారాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆసనాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని సూచించారు. యోగా …

Read More »

జన్నెపల్లె పెద్ద వాగులో యువకుడి మృతి

నవీపేట్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలంలోని జన్నెపల్లె గ్రామ పెద్దవాగులో యువకుడి మృతి కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి… జన్నెపల్లె గ్రామానికి చెందిన అరే శ్రీధర్‌ (24) అనే యువకుడు కనిపించక పోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. అనంతరం జన్నెపల్లె పెద్ద వాగు సమీపంలో బట్టలు, సెల్‌ ఫోన్‌, చెప్పులు కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. గజఈతగాళ్ళ …

Read More »

దళితబంధు అర్హుల ఎంపిక భాద్యతలు అదికారులకే అప్పగించాలి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు అర్హుల ఎంపిక బాధ్యతలు ఎమ్మెల్యేలకు కాకుండా అధికారులకే అప్పగించాలని, అర్హుల ఎంపిక లో నిరుపేదలకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని, దళిత బందును పేదల బందుగా మార్చి అన్ని కులాలలో ఉన్న పేదలందరికీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్‌ డిప్యూటీ తహసిల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పివైఎల్‌ జిల్లా …

Read More »

రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

వేములవాడ, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి మహా శివరాత్రి జాతర సందర్భంగా రాజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను ఆర్‌డిఓలతో కలసి జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా, తాగునీటి సమస్య లేకుండా చూడాలని సూచించారు. శాశ్వత మరుగుదొడ్లతో పాటుగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులకు అదనపు …

Read More »

జిల్లా కలెక్టర్‌ రక్తదానం చేశారు…

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తాడ్వాయి మండలం సంగోజివాడిలో శనివారం వసంతపంచమి సందర్భంగా శ్రీ సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. విద్యార్థులు …

Read More »

మాస్‌ కమ్యూనికేషన్‌ లో ఇద్దరికి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలోని పరిశోధక విద్యార్థులు సట్లపల్లి సత్యం, సిహెచ్‌. రమేష్‌ లకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. వారు రూపొందించిన సిద్ధాంత గ్రంథాల మీద తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో గల మినీ సెమినార్‌ హాల్‌లో శనివారం ఉదయం ఓపెన్‌ వైవా వోస్‌ (మౌఖిక పరీక్ష) నిర్వహించారు. మాస్‌ …

Read More »

సోమవారం నుండి యధావిధిగా ప్రజావాణి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ సీ.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ కేసులు పెరగడంతో గడిచిన రెండు వారాలుగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడుతున్న …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »