NizamabadNews

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

గాంధారి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక చౌరస్తా వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్‌ పాలకుల నుండి భారతదేశం 1947 ఆగస్టు 15 న స్వాతంత్రం పొందినా, తెలంగాణకు నిరంకుశ నిజాం కబంద హస్తాలలో ఉందని అన్నారు. భారతదేశం మొత్తం …

Read More »

ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు

గాంధారి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలో కేక్‌ కట్‌ చేసి చిన్నారులకు మిఠాయిలు పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రపంచంలో భారత దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళుతున్న విశ్వవిజేత ప్రధాని మోడీ అని బీజేపీ నాయకులు …

Read More »

గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా చేసుకుందాం…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో చేసుకుందామని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి కోరారు. 19 వ తేదీన జరుపుకోబోయే వినాయక నిమజ్జనం సందర్భంగా గణేష్‌ శోభాయాత్ర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, సిపి కార్తికేయతో కలిసి రథం బయలుదేరే దుబ్బ నుండి ప్రారంభించి వినాయకుల బావి వరకు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ …

Read More »

ఘనంగా విశ్వకర్మ భగవాన్‌ మహోత్సవం

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండలకేంద్రంలోని మోతె రోడ్డు మార్గంలో విశ్వకర్మ గుట్ట పై శుక్రవారం విశ్వకర్మ భగవాన్‌ మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ గుట్టపై ఉన్న విశ్వకర్మ భగవాన్‌కు ఉదయం నుండి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. శోభయాత్ర, ధ్వజారోహనం, గణపతిపూజ, పుణ్యహవచనం, మండపారాదన పూజ, అంకురార్పన, యజ్ఞం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వకర్మ భగవానుని …

Read More »

18న విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 18వ తేదీ శనివారం నిజామాబాద్‌ పట్టణంలోని విద్యుత్‌ కేంద్రాలలో పవర్‌ హౌస్‌, తిలక్‌గార్డెన్‌, వినాయక్‌ నగర్‌, బోర్గాం, దుబ్బ, సుభాష్‌ నగర్‌, అర్సపల్లి, గుపాల్‌ పల్లి, విచ్‌ కాంపౌండ్‌, న్యూ హౌసింగ్‌ బోర్డ్‌, ముబారక్‌నగర్‌ విద్యుత్‌ కేంద్రాల్లో నెలవారి మరమ్మతుల కారణంగా విద్యుత్‌ సరఫరాలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందని, …

Read More »

వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 40 వ వార్డులో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ సందర్శించారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని సూచించారు. అంగన్‌వాడి కేంద్రాన్ని, ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్‌, …

Read More »

ఆయా గ్రామాలలో తెరాస గ్రామ కమిటీలు…

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశానుసారం బాల్కొండ నియోజకవర్గ మంత్రి సూచన మేరకు వేల్పూరు మండల గ్రామ టిఆర్‌ఎస్‌ పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు గురువారం ప్రకటించారు. మండల సమన్వయ సభ్యులు మాట్లాడుతూ వేల్పూర్‌ మండలంలోని వివిధ గ్రామాల నూతన టిఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. వేల్పూర్‌ మండల గ్రామ …

Read More »

ఫణిహారం రంగాచారికి ఘన నివాళి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాల సందర్బంగా గురువారం కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఫనిహారం రంగాచారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ భూమి కోసం విముక్తి కోసం 4 వేల మంది కమ్యూనిస్టు …

Read More »

వేల్పూర్‌లో 10 సెంటర్లలో వ్యాక్సినేషన్‌

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ ఆదేశాలనుసారం కోవిడ్‌ వాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా మండలంలో 10 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్‌ అశోక్‌ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం మండలంలోని 10 ఆరోగ్య ఉప కేంద్రాలలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడం జరుగుతుందని, మండల ప్రజలు పూర్తి స్థాయిలో …

Read More »

స్థానికులకే ఉద్యోగాలలో అవకాశం ఇవ్వాలి

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత నెల రోజులుగా ఔట్‌ సోర్సింగ్‌ ప్రతిపాధికన భర్తీ చేస్తున్న ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, వేరే జిల్లా వారిచే భర్తీ చేయకూడదని వైస్‌ ఛాన్స్‌లర్‌ రవీందర్‌కి టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌ గౌడ్‌ వినతి పత్రం అందజేశారు. తెలంగాణ యూనివర్సిటీలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు, జూనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, కుక్‌, స్వీపర్‌, అటెండర్‌, సెక్యురిటి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »